2026.. రెండో అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. 2026 ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి సంవత్సరాల్లో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ వెల్లడించింది.
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. 2026 ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి సంవత్సరాల్లో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ వెల్లడించింది. 2024 ప్రస్తుత రికార్డుల్లో అత్యంత వేడి సంవత్సరంగా ఉంది.
2026లోనూ ఉష్ణోగ్రతలు అదే స్థాయికి చేరే లేదా దానిని అధిగమించే అవకాశం 20 శాతం వరకు ఉందని కోపర్నికస్ అంచనా వేసింది. ఈ ఏడాది సగటు పారిశ్రామికీకరణకు ముందుకాలం(1850-1900)తో పోలిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం దాదాపు ఖాయమని తెలిపింది. 2026 అక్టోబర్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి అక్టోబర్ నెలగా నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

