Warmest Year: 1,25,000 ఏండ్లల్లో.. ఇదే వార్మెస్ట్ ఇయర్
Warmest Year: ఉష్ణోగ్రతలు వేడుక్కుతున్నాయి. ఆ హీట్ ఎలా ఉంటుందో ఈ ఏడాది చూశాం. గ్లోబల్ వార్మింగ్‌కు తోడు ఎల్‌నినో వల్ల.. ప్రపంచం అంతటా టెంపరేచర్లు రెచ్చిపోతున్నాయి. ఇక యురోపియన్ శాస్త్రవేత్తల ప్రకారం గత 1,25,000 ఏండ్లల్లో.. ఇదే వార్మెస్ట్ ఇయర్ అని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ఈ ఏడాది వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. అంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక గడిచిన 1,25,000 ఏండ్లల్లో.. ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రత(Warmest Year)లు నమోదు అయినట్లు యురోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు తెలిపారు. అక్టోబర్‌లో నమోదు అయిన ఉష్ణోగ్రతల ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 2019లో నమోదు అయిన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ ఏడాది 0.4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు అయినట్లు ఈయూ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ డైరెక్టర్ సమంత బుర్జెస్ పేర్కొన్నారు. అక్టోబర్‌లో టెంపరేచర్లు అసాధారణంగా ఉన్నట్లు తెలిపారు.
1850 నుంచి 1900 మధ్య ప్రపంచవ్యాప్తంగా వాయు ఉష్ణోగ్రతలను పోలిస్తే .. ఈ ఏడాది అక్టోబర్‌లో 1.7 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్లు భావిస్తున్నారు. పారిశ్రామీకరణకు ముందు ఉన్న వాతావరణంతో ప్రస్తుత అంచనా వేశారు. దీంతో 2023ని హాటెస్ట్ ఇయర్‌గా పేర్కొన్నారు. కోపర్నికస్ డేటా సెంటర్ 1940 నుంచి అందుబాటులో ఉన్నది. ఇక యూఎన్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమెట్ చేంజ్ ఇచ్చిన డేటా ప్రకారం.. గడిచిన 1,25,000 ఏండ్లల్లో.. ఈ ఏడాది హాటెస్ట్ ఇయర్‌గా నమోదు అయినట్లు తెలుస్తోంది.
గ్రీన్‌హౌజ్ వాయువులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు.. ఎల్‌నినో తోడవ్వడం వల్లే .. ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్లు రెట్టింపు అవుతున్నట్లు పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్త మైఖేల్ మాన్ తెలిపారు. అతి తీవ్రమైన వెదర్ వల్ల లిబియా లాంటి ప్రదేశాల్లో విధ్వంసకర రీతిలో వరదలు వస్తున్నాయి. దక్షిణ అమెరికా, కెనడాల్లో హీట్‌వేవ్‌కు కూడా ఇదే కారణం అవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

