Himachal Pradesh CM: కాసోల్‌లో చిక్కుకున్న 2000 మంది టూరిస్టుల తరలింపు
Kasol tourists: కాసోల్‌లో చిక్కుకున్న రెండు వేల మంది టూరిస్టులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం తెలిపారు. సుమారు రెండు వేల టూరిస్టు వాహనాలను కూడా పంపించినట్లు చెప్పారు. మనాలీలో ఇంకా అనేక ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ అందడం లేదు.
షిమ్లా: కులు జిల్లాలోని కాసోల్ ప్రాంతంలో చిక్కుకున్న సుమారు 2000 మంది టూరిస్టులను రక్షించారు. వాళ్లను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం(Himachal Pradesh CM) సుఖ్విందర్ సింగ్ సుకు తెలిపారు. కులు-మనాలీ రోడ్డును మంగళవారం సాయంత్రం తెరిచారు. ఆ రూట్లో సుమారు 2200 వాహనాలు వెళ్లినట్లు తెలిపారు. మనాలీలో ఇంకా అనేక ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. టూరిస్టులు తమ కుటుంబసభ్యులతో ఫోన్ మాట్లాడలేకపోతున్నారు. మనాలీ లెఫ్ట్ బ్యాంక్ రూట్లో రోడ్డును తెరిచారు. ఇక దక్షిణం వైపున ఉన్న రోడ్డు నది ప్రవాహంలో కొట్టుకుపోయింది.
కాసోల్-బుంతార్ రోడ్డు వైపు కూలిన కొండచరియల్ని తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. టూరిస్టు ప్రాంతమైన లాహోల్‌లో చిక్కుకున్న వాహనాలను కూడా తరలించినట్లు సీఎం తెలిపారు. సుమారు 300 వెహికిల్స్ అక్కడ నుంచి వెళ్లినట్లు చెప్పారు. కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి సమాచారాన్ని తెలుసుకుని ఫేస్బుక్లో షేర్ చేస్తున్నట్లు ఏఎస్పీ ఆశిశ్ శర్మ తెలిపారు. ఆహారం, తాగునీరును అందిస్తున్నట్లు చెప్పారు.
వరదల వల్ల చిక్కుకుపోయిన టూరిస్టులకు హోటళ్లు, టూరిజయం యూనిట్లు ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నాయి. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆరు హెలికాప్టర్లు రంగంలోకి దిగినట్లు సీఎం తెలిపారు. వరదల వల్ల రాష్ట్రానికి దాదాపు 4 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

