మరుగుజ్జు మన్సూరీకి వధువు దొరికింది..

కైరానా: మరుగుజ్జు అజీమ్ మన్సూరీ నిరీక్షణ ఫలించింది. పెళ్లి చేసుకోవాలన్న అతని కోరిక తీరనున్నది. తనకు వధువును వెతికి పెట్టాలంటూ అయిదేళ్ల క్రితం అతను చేసిన అభ్యర్థన ఇప్పుడు నెరవేరింది. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాకు చెందిన అజీమ్ మన్సూరీ ఎత్తు 2.5 ఫీట్లు. కైరానా గ్రామానికి చెందిన అతను.. అయిదేళ్ల క్రితం తనకు వధువును వెతికిపెట్టాలంటూ పోలీసుల్ని కోరారు. దాంతో ఆ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ మరుగుజ్జు మన్సూరీకి ఇప్పుడు వధువు దొరికింది. హాపుర్‌లోని బుస్రాను అతని పెళ్లి చేసుకోనున్నాడు. మరుగుజ్జు మన్సూరీకి తగినట్లుగా మరుగుజ్జు బుస్రా ఉన్నది. హాపుర్‌లో ఉన్న బుస్రా ఇంటికి వెళ్లిన మన్సూరీ.. ఒక గోల్డ్ రింగ్‌ను, 2100 నగదును ఇచ్చాడు. ఇక బుస్రా ఫ్యామిలీ కూడా మన్సూరీకి గొల్డ్ రింగ్‌తో పాటు 3100 క్యాష్‌ను ఇచ్చారు.
మాన్సూరీ 5వ తరగతి డ్రాపౌట్. అతను కాస్మటిక్ స్టోర్‌ను నడిపిస్తున్నాడు. మరుగుజ్జు కావడం వల్ల జీవితభాగస్వామి దొరకడం లేదని పోలీసుల్ని ఆశ్రయించాడు. 2019లో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ను కూడా అతను కలిశాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆయనకు ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Azeem Mansuri
- Bushra
- Kairana
- Pintop
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

