CM Vijay: 144 ఓట్లతో బలపరీక్షలో నెగ్గిన సీఎం విజయ్
CM Vijay: సీఎం విజయ్‌కి లైన్ క్లియరైంది. బలపరీక్షలో నెగ్గారు. టీవీకే పార్టీకి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. విశ్వాస పరీక్ష తీర్మానంపై చర్చ సమయంలో అన్నాడీఎంకే చీలింది. ఇక ఓటింగ్‌లో పాల్గొనకుండా.. డీఎంకే వాకౌట్ చేసింది. తమ ప్రభుత్వాన్ని హార్స్‌లా వేగంగా నడుపుతామని, కానీ హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడమన్నారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ సీఎం విజయ్(CM Vijay) బలపరీక్షలో నెగ్గారు. ఆయనకు అనుకూలంగా 144 మంది ఓటేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయిదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక డీఎంకే పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే రెబల్స్ .. టీవీకేకు అనుకూలంగా ఓటేశారు. కానీ పళనిస్వామి వర్గం మాత్రం వ్యతిరేకంగా ఓటేసింది. టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో నెగ్గింది. విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఓ స్థానం ఖాళీ అయ్యింది. ఇక ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే.. బలపరీక్షలో పాల్గొనలేదు. అయితే విశ్వాసపరీక్ష కన్నా ముందే కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు విజయ్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీలో 117 మ్యాజిక్ మార్క్.
హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడం..
బలపరీక్షపై చర్చ తర్వాత తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడారు. తమ సర్కారు సెక్యూలర్ విధానానికి కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం వేగవంతమైన గుర్రం తరహాలో పనిచేస్తుందని, కానీ హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడదని చెప్పారు. గత ప్రభుత్వాలకు చెందిన అన్ని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అన్ని పార్టీలకు చెందిన సభ్యులు విశ్వాస పరీక్ష చర్చలో పాల్గొన్న తర్వాత విజయ్ మాట్లాడారు. ఓటింగ్‌కు ముందు సభా డోర్లను మూసివేయాలని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఎవరి సీట్లలో వారే కూర్చున్నారు. బ్లాక్ వారిగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

