డీజే సౌండ్ తట్టుకోలేక 140 కోళ్లు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పెండ్లి ఊరేగింపులో పెట్టిన డీజే సౌండ్‌ను తట్టుకోలేక 140 కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీఫామ్ యజమాని ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు.. యూపీలో ఘటన
లక్నో, ఏప్రిల్ 30 : ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పెండ్లి ఊరేగింపులో పెట్టిన డీజే సౌండ్‌ను తట్టుకోలేక 140 కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీఫామ్ యజమాని ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుల్తాన్పూర్ జిల్లా బల్దిరాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దరియాపూర్ గ్రామంలో సబీర్ అలీ అనే వ్యక్తి కోళ్లఫామ్ నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో వివాహ ఊరేగింపు ఆయన కోళ్లఫామ్ పక్కనుంచి వెళ్లింది.
ఈ ఊరేగింపులో డీజే నుంచి వచ్చిన తీవ్రమైన శబ్దాలకి పౌల్ట్రీఫామ్‌లోని కోళ్లు భయంతో వణికిపోయాయని యజమాని సబీర్ అలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ సౌండ్‌ను తట్టుకోలేక 140 కోళ్లు మృతి చెందాయని తన బాధను వెళ్లగక్కాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డీజే ఆపరేటర్ కవి యాదవ్, మరికొందరిపై కేసు నమోదుచేశారు. కోళ్ల మృతికి నిజంగానే డీజే సౌండ్ కారణమా? లేదా మరేదైనా కారణమా? అనే విషయాన్ని పోలీసులు తేల్చనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

