పూణేలో రేపటి నుంచి 12 గంటలు రాత్రి కర్ఫ్యూ

ముంబై: మహారాష్ట్రలోని పూణేలో కరోనా తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి 12 గంటలపాటు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వారం రోజుల పాటు 12 గంటల కర్ఫ్యూ అమలులో ఉంటుంది. పూణే డివిజనల్ కమిషనర్ సౌరభరావు శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వారం రోజులు బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయని, సిటీ బస్సులు కూడా నడవవని తెలిపారు. హోమ్ డెలివరీని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.
వివాహాలు, అంత్యక్రియలు మినహా ఎలాంటి బహిరంగ వేడుకలను అనుమతించబోమన్నారు. వివాహాలకు గరిష్ఠంగా 50 మంది, అంత్యక్రియలకు 20 మంది పరిమితి విధించినట్లు తెలిపారు. ఈ ఆంక్షలు, నిబంధనలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని అన్నారు. వచ్చే శుక్రవారం పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
పూణేలో బుధవారం 8,605, గురువారం 8,011 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

