quota for Agniveers | ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీర్లకు పది శాతం రిజర్వేషన్.. హర్యానా ప్రభుత్వం ప్రకటన
quota for Agniveers | అగ్నివీర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వయో సడలింపుతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పింది.
చండీగఢ్: అగ్నివీర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. (quota for Agniveers) అలాగే వయో సడలింపుతోపాటు ఇతర ప్రయోజనాలు అందిస్తామని చెప్పింది. సాయుధ దళాలలో నాలుగేళ్ల కాంట్రాక్ట్ గడువు ముగిసి బయటకు వచ్చే అగ్నివీర్లను ఆదుకుంటామని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ తెలిపారు. ఇతర ప్రయోజనాలతోపాటు రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్లో పది శాతం కోటా కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్లో వయో సడలింపు, సమాంతర రిజర్వేషన్ ఇస్తామని అన్నారు.
కాగా, గ్రూప్ బీ, సీ ప్రభుత్వ పోస్టులకు నిర్దేశించిన గరిష్ట వయస్సులో అగ్నివీర్లకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు సీఎం నయాబ్ సింగ్ సైనీ తెలిపారు. 2027లో సర్వీస్ ముగిసే అగ్నివీర్ల మొదటి బ్యాచ్‌కు వయస్సు సడలింపు ఐదు సంవత్సరాలు ఉంటుందన్నారు. ‘గ్రూప్ సీలోని సివిల్ పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అగ్నివీర్లకు ఐదు శాతం, గ్రూప్ బీలో ఒక శాతం సమాంతర రిజర్వేషన్ అందిస్తాం’ అని తెలిపారు. అలాగే కానిస్టేబుల్, మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైల్ వార్డెన్, ఎస్పీవో పోస్టులకు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 10 శాతం సమాంతర రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు అగ్నివీర్లను నియమించుకునే పారిశ్రామిక సంస్థలకు రాయితీ ఇస్తామని హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ తెలిపారు. ‘ఏదైనా పారిశ్రామిక సంస్థ అగ్నివీర్‌కు నెలకు రూ.30,000 కంటే ఎక్కువ జీతం ఇస్తే, మా ప్రభుత్వం ఆ పారిశ్రామిక యూనిట్‌కు సంవత్సరానికి రూ. 60,000 సబ్సిడీ ఇస్తుంది’ అని ప్రకటించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ మేరకు హామీలిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

