ప్రతి గడపకూ ప్రభుత్వ పథకాలు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే మండలంలోని కోదండపురం గ్రామంలో మన-ఊరు మన ప్రభుత్వం- మన పథకాల కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు.
- సీఎం కేసీఆర్ పాలనలోనే సుభిక్షంగా ప్రజలు
- దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
- కోదండపురంలో మన ఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు కార్యక్రమానికి శ్రీకారం
- అన్ని శాఖల అధికారుల సమక్షంలో గ్రామ సభ
- గ్రామంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులపై కరపత్రం విడుదల
పెద్దఅడిశర్లపల్లి, సెప్టెంబర్ 21 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యే మండలంలోని కోదండపురం గ్రామంలో మన-ఊరు మన ప్రభుత్వం- మన పథకాల కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు. ముందుగా గ్రామస్తులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలకారు.
వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామసభ నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కరపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేని వారు ప్రస్తుతం గ్రామంలో రచ్చబండల పేరుతో ప్రజలకు మాయ మాటలు చెబుతూ పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అన్ని గ్రామాల్లో మహిళలు కోలాటాలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు.
సమస్యలు తెలుసుకుంటూ.. పరిష్కరిస్తూ..
ప్రజల సమస్యలను అధికారుల సమక్షంలోనే అడిగి తెలుసుకున్నారు. కోదండపురం గ్రామం నుంచి రంగారెడ్డి గూడెం స్టేజీ వరకు బీటీ రోడ్డుకు మరమ్మతులు చేయించాలని, గ్రామస్తులకు ఉపయోగపడే రోడ్డు మట్టి రోడ్డు నిర్మాణం చేయాలని కోరగా తక్షణమే సొంత నిధులతో మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. కోదండపురం వాటర్ ప్లాంటులో ఉద్యోగాలు ఇప్పించాలని యువకులు కోరడంతో మెట్రో వాటర్ బోర్డు అధికారుల దృష్టికి తీసువెళ్లానని ఆరుగురికి ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కొందరు వృద్ధ్దులు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో పంచాయతీ అధికారుల నుంచి వివరాలు సేకరించి అర్హుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయించాలని అదేశించారు. అలాగే కోదండపురం, ఘట్ నెమలిపురం, మదాపురం, ఘనపురం గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, డిండి ఎంపీపీ మాధవరపు సునీత, సర్పంచులు మైనం రాణి, వెంకటేశ్వర్, జ్యోతి, తోటకూరి పావని, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, నాయకులు ముత్యంరావు, అర్వపల్లి నర్సింహ, ఎర్ర యాదగిరి, శ్రీను, పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

