గాలిపటం ఎగురవేస్తున్నారా..! జర భద్రం
సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఎంత ప్రధానమో గాలిపటాలకు అంతే క్రేజ్.
- జాగ్రత్తలు తీసుకుంటే ఆనందం మీ వెంటే
సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు, రంగవల్లులు, గొబ్బెమ్మలు ఎంత ప్రధానమో గాలిపటాలకు అంతే క్రేజ్. ఈ పండుగ సమయాల్లో గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందిస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో గాలి పటాలు ఎగురవేసే సంస్కృతి కొద్దిమేర తగ్గినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అధికంగా ఉన్నది. గాలిపటం ఎగురవేసేటప్పుడు ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఈ సమయంలో ఎదురయ్యే ప్రమాదాల గురించి పట్టించుకోవడం మానేస్తారు. గోడలు, మిద్దెలు, ఎతైన భవనాలు, మైదానాల నుంచి ఎగురవేస్తూ ప్రమాదాలకు గురవడం చూస్తునే ఉంటాం. దానికి తోడు విద్యుత్ తీగలకు చుట్టుకున్న గాలి పటాలను తొలగించే ప్రయత్నంలోనూ విద్యుదాఘాతానికి గురైన సంఘటనలూ చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది. ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్లాస్టర్ చుట్టుకోవాలి
గాలిపటాలు ఎగురేయడంలో ఆనందం ఉంటుంది. దాంతో పాటు అజాగ్రత్తగా ఉంటే ఎనలేని దుఖఃమూ దరిచేరుతుంది. గాలిపటాలు ఎగురవేసే సమయంలో వేళ్లకు ప్లాస్టర్ వంటివి చుట్టూకోవాలి. దీని వల్ల మాంజా పూసిన దారం వల్ల చేతివేళ్లు తెగకుండా ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం జరిగితే, గాయాన్ని శుభ్రంగా కడగాలి. రక్తస్రావం ఆగేందుకు బ్యాండేజితో కట్టేసి, సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గాలిపటాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతాల్లో ఎగురవేయడమే మేలు.
మిద్దెలు ఎక్కక పోవడమే ఉత్తమం
గాలిపటాలు బాగా ఎత్తున ఎగరాలని చాలా మంది సమీపంలోని మిద్దెలు, ఎతైన గోడలపైకి ఎక్కుతారు. ఇలా ఎక్కి గాలిపటాలను వదిలే సమయంలో ప్రమాదవశాత్తు కింద పడే అవకాశం ఉంది. ఒకవేళ కిందపడి దెబ్బలు తగిలిన చోట మసాజ్ చేయకూడదు. రక్తస్రావం ఉన్న చోట బ్యాండేజిని వదులుగా చుట్టాలి. గాయాలైన చోట పసుపు కూడా అద్దకూడదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి.
విద్యుత్ తీగలున్న చోటకు వద్దు
గాలి పటాలు ఎగురవేయడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ప్రధానంగా విద్యుత్లైన్లు తగిలిన దానిని కర్రలు, గడలతో లాగేందుకు ప్రయత్నం చేయరాదు. దీనివల్ల షార్ట్‌సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగనట్లయితే సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయలో తెలుపాలి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- flying kite
- kite
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

