అలంపూర్, నవంబర్ 28 : మంగళవారం అలంపూర్‌లో గులాబీ దండు కదిలింది. పట్టణంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించగా జై కేసీఆర్, జై తెలంగాణ, జై చల్లా, జై విజయుడు నినాదాలతో పట్టణం హోరెత్తింది. పూలమాలలు, శాలువాలతో చల్లాను ప్రజలు సత్కరించారు. అక్బర్‌పేటలోని ఆంజనేయస్వామి ఆలయం, దర్గాలో చల్లా ప్రార్థనల అనంతరం రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి విజయుడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రోడ్ షోలో బీఆర్ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, వైస్‌చైర్మన్ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలొచ్చారు.