కళ్లము కనపడదాయే!
కళ్లము యాదికొచ్చిందంటే నోట్లే తేనె పడ్డంత సంబురం
కళ్లము యాదికొచ్చిందంటే
నోట్లే తేనె పడ్డంత సంబురం
బంతి కాడి బాగోతం పాటలకు
ఎడ్లకు సుత ముద్దొచ్చి
చెవులు రిక్కించుకొని వినేవి
కుప్పల మీది బూడిద ముగ్గుతో
కళ్లము పున్నమి ఎన్నెలోలె కనపడేది
కావలి కాసే రాత్రులల్ల
సంకురాతిరి గొంగళ్లను
అలుముకొని మురిసిన గడ్డివాములెన్నో!
జోలెల నోళ్లు నింపి
బిచ్చగాళ్ల ఆకలి తీర్చే
అదో కర్ణుడి చేయి
గుల్లకు, గుమ్మికి, కచ్చురముకు
ముచ్చట కలిపి
అప్పుడప్పుడు రేలు, పగళ్ళ లెక్క చూసే
పంట పొలాల ఒంటరి సిపాయి
తూర్పాల పుణ్యమో,
మట్టి పెట్టే బిచ్చమో కానీ!
తర్ర వడ్లతో, తాలు బియ్యంతో
లేకి బతుకులను నిలబెట్టే నిట్టాడు
ఎర్రటెండ పోటుకు
చెమట కార్చే చేటను చూసి
కలుక్కుమనే కన్నీటి మొగులు
ఇసుక, నువ్వుల కలెగలుపు కుప్పలను
కోడుచూ, చెరుగుచూ వేరుచేసే తీరు చూసి
పొంగి పొర్లే అలుగు
కమ్మరి, కుమ్మరి, వడ్లొల్ల బంతికి
తానే గలగలమనే దొంతుల సద్దు
కంది పొరుకను పొనుకలల్ల నింపి
పొయ్యికి పంపే ఇంటి బందుగు
కొట్టాల్లోని పనుల మందకు
పూట కూలమ్మ
కాలం మారిపోయే
కళ్లము కనపడదాయే
ఎటుచూసిన మోటార్లాయే
ఎదుగుడో, తగ్గుడో కానీ!
ఎద్దులు సుత కనుమరుగవుతుండే!
వూట్ల భద్రయ్య
95502 56840
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

