వైభవ గీతిక
ధరాతలాంబున ధ్వనించే నాదం దిగంతాలనే కదిపిన వాదం తెలంగాణ జయశంఖారావం దాశరథి ఘన కవనపుయాగం కాళోజీ ధిక్కారపు వేదం
ధరాతలాంబున ధ్వనించే నాదం
దిగంతాలనే కదిపిన వాదం
తెలంగాణ జయశంఖారావం
దాశరథి ఘన కవనపుయాగం
కాళోజీ ధిక్కారపు వేదం
శాతవాహన శౌర్యరథంబుకు ఇరుసు తెలంగాణ
ఇక్ష్వాకుల నాగరీకతకు గొలుసు తెలంగాణ
చాళుక్య ప్రాకార గోపుర మెరుపు తెలంగాణ
కాకతీయుల మేటి వైభవం చాటు తెలంగాణ
వేల ఏండ్ల తెలుగు చరిత్రకు మలుపు తెలంగాణ
తేనెతేట తీపి ఊట తెలంగాణ తెలుగుతోట
మెరుపువోలె తళుకులీనె విరుపులున్న జనంమాట
నాటినుంచి ఈనాటి దాక ఊటవోలె ఉబికేటి పాట
ఉగ్గుపాల తల్లియాస తెలంగాణమే జీవనభాష
కవనంలోన కదనంలోన ఒదిగిన
పదలయ స్వరముల ఘోష
ఎగిసిపారే గోదారి ఎన్నెల నవ్వుల దారి
కులికి జారే కృష్ణమ్మ కొండల కోనల పారి
కిన్నెరసాని ఆట వెన్నెల పూసిన బాట
సిలకల వాగు ఊట పాలేరే తీయని తేట
జలజలజల జలతారుల అల
నీలాంబరమునే మరిపించును ఇల
నిండుగ ఎగిసి కొండల తడిపి
పండు వెన్నెల పాలపుంతల
పయ్యెద కాంతుల నేలకు ఒంపిన
తరంగ విహంగ పదంబుల స్వర
మంజీరంబుల సంగమమీ స్థలి
శిలాతోరణపు గిరిపురంబిది
యాదగిరి సోన
జనకథనంబున యాదవబాలురు
తొలిగాంచిన కోన
సిద్ధమునులే నడయాడిన జాడ
ఇది వేములవాడ
శతకంబులతో పేర్చిన మేడ
శేషప్ప కవి పద్యము పాడ
ధర్మపురి గోదావరి తీరము
లోక నీతులే పొంగులువార
వ్యాస ప్రణీతం పావన క్షేత్రం
వాగ్దేవి కరవీణావాద్యం
విద్యలనొసగె బాసర క్షేత్రం
అధ్యాపనకు ఆలయ తేజం
ఏటవాలు నాగేటి సాలుకు
ఏరువాక తొలి సినుకుల జాలుకు
హారతి పట్టిన కృష్ణాతీరం
ఆ అల్లంపురం
నాగరికత తొలి పురానివాసం
అనాదినాదం అంబ వేదం
జోగులాంబ అష్టాదశపీఠం
రాతిని మీటితె రాగములొలికే
వేయి స్తంభముల కళామంటపం
ఓరుగల్లు రామప్పమందిరం
కోయరాజుల సిలకలగుట్ట
సమ్మక్క సారలమ్మల పట్ట
అడవిని తాకితే తరిమిన దిట్ట
మేటి బంటులను నేలకు కొట్ట
ధాటికి సేనె పరుగులు పెట్ట
సమ్మక్క ఆ గద్దెను ముట్ట
కుంభమేళమై పబ్బతి పట్ట
పాల్కురికి జన కవనపు మార్గం
నాటి లోకగతి మేటిగ తెలిపిన
దేశీ ద్విపదలో మెరిసిన శిల్పం
జాను తెనుగు తొలి మావితోరణం
మల్లినాథుని లక్షణ భాష్యం
విద్యానాథుని యశోభూషణం
జయపుసేనుని పేరిణీ నృత్యం
కళావిలాసపు కావ్యవర్తనం
దివినించి దిగివచ్చిన తేజం
పరవశాన పురివిప్పిన కవనం
భువినేలే ఈ రాజులే మెచ్చి
అడిగినా అంకిత మివ్వని వైనం
రాజుల యాచన కన్న
కందమూలములైన తృప్తే మిన్నని
పలికిన పోతన మాత్యుని గన్న
తెలంగాణయే ధన్యమురన్న
నోటివెంట అలవోక చాటువులు
ఊటవోలె ప్రవహించిన ధాటికి
సాటి కవులు చెయ్యెత్తి మొక్కిన
అప్ప కవీశుని అక్షర కవనం
అశుధారలచే మురిసేను భువనం
రామగిరీశుని సన్నిధానమున
రంగనాథ రామాయణ చరితం
రాసిన మేటి బుద్ధారెడ్డి
కావ్య సంపుటిల మెరుపుల దట్టి
నాదవేదియై తానె కిన్నెరయి
రాగకర్తయై భావతీర్థుడై
భద్రాదీశుని భక్తితో పొగిడిన
బాధల కోర్వక ఆర్తితో తెగిడిన
కంచర్ల గోపన్న కీర్తన
తెలంగాణ జనగీతికి అర్చన
యాసన్ బాషన్ జీవన గోసన్
ఎరుకతో గురువుల నుడిగిన ధ్యాసన్
ఎంతో వొడుపుతో నొడిసి పట్టిన
వెదురుతో తడకలనల్లిన చందం
వేపూరి కీర్తన ఎంతో అందం
హనుమద్దాసుని బోధే విందం
ముని ముచికుందుని ఆరనిదీపం
వెంకటదాసుని కీర్తన రూపం
ఎన్ని కీర్తనలు ఎన్ని తత్వములు
అన్నమయ్యవలె అల్లిన యాలలు
రాకమచర్ల వెంకటదాసుని
పదములు పరిపరి విధములు
పసుల కాపరి పాలేరయ్య
వీరగురునిలా ఆ యిద్దాసుడు
బోధను తెలిపిన శివబసవయ్య
అచలం సిద్ధం అనంత భావం
వేమనల దర్శించిన యోగం
నిర్వికార ఉపాసన మార్గం
మన యిద్దాసుని మహపద ధ్యానం
మన్నెంకొండ కాంతుల నిండ
పరికింప అది పరుపుల బండ
ఆ బండలపై ఆ ఎండలపై సాధకుడై
హఠయోగముతో సంచరించిన చెన్నదాసుడు
గౌరారం ఆ పొలిమేరతోవలలో
అసువుగ వొలికిన తత్వాలెన్నో
నీతికి పెద్ద పీఠం వేసి
జాతి భేదముల నిరసన తెలిపిన
వరకవి సిద్ధుడు కుమ్మరి బుద్ధుడు
నిజమేదో ఎరిగించిన వాదన
నిగూఢమైన మార్మిక బోధన
చిరుతొండ సుగ్రీవ విజయం
వందలు వేలు యక్షగానముల
పదగుంభనమది ఎంతో అందం
పరవశంబుల లయ జగబంధం
మసూర బాధ తోర మామిడి
మల్యాల యిద్దమదాసుడు
చరివిరాల భాగయ్య శ్రేష్టుడు
యక్షగాన యల్లమ్మ క్రిష్ణుడు
వేమనలా అచలుండైన
యిమ్మడిశెట్టి మన చంద్రయ్య
కవనము లోతు అందనిదయ్య
మరిసిన చరితం నిలిపిన మొగురం
సురవరమే మన సాహితి శిఖరం
గులాబి తారల పరిమళ ధూపం
మగ్దూం గీతం మండే దీపం
వానమామలై కవనశిల్పం
వేముగంటి ఆ పద్యరూపం
కవన తాండవ ప్రతాప ఖండం
లింగమూర్తి కవి పొంగే గుండం
సుద్దాల హనుమంతుని రాగం
తెలంగాణ పోటెత్తే తాళం
గోరటి వెంకన్న
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

