ఎక్కడా చేతులు
చాపొద్దనే..
తన ముందు
చేతులు చాపమనేవాడు
బెత్తంతో మా మాస్టారు
తరగతి గదంటే
నాలుగు గోడలు కాదు
నలుగురు పిల్లలు
తరగతి గదిలోకి
ప్రవేశించటమంటే
ప్రపంచంలోకి
ప్రయాణించటమే
గుడులూ
భక్తుల్నే తయారుచేస్తాయి
బడులూ
దేశభక్తుల్ని తయారుచేస్తాయి
అక్షరాలు
దిద్దుతున్న రోజుల్లో
తెలియలేదు
ఎవరి తలరాతను వాళ్లమే
దిద్దుకుంటున్నామని
– చిత్తలూరి సత్య 9133832246