వర్షాకాలం రాకతోనే గృహిణులకు ఒక పెద్ద తలనొప్పి మొదలవుతుంది. నిరంతరం కురిసే వర్షాలు, మబ్బులతో కూడిన వాతావరణం వల్ల దుస్తులు త్వరగా ఆరవు. దీనివల్ల వాటి నుంచి ఒక రకమైన చెడు వాసన వస్తుంది. అంతేకాదు దుస్తుల్లో తేమ ఎకువ కాలం ఉండటం వల్ల వాటిపై బ్యాక్టీరియా, ఫంగస్ చేరే ప్రమాదం కూడా ఉంది.
మరీ ఈ వర్షాకాలంలో మీ దుస్తుల నుంచి ఎలాంటి దుర్వాసన రాకుండా, ఎల్లప్పుడూ సువాసనభరితంగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుందాం..
వెనిగర్ వాడండి: చాలా మంది ఎకువ సర్ఫ్ లేదా లిక్విడ్ వాడితే దుస్తులు బాగా క్లీన్ అవుతాయని, వాసన రావని అనుకుంటారు. కానీ, ఎకువ డిటర్జెంట్ వాడటం వల్ల అది దుస్తుల పోగులలో పేరుకుపోయి, తేమను బంధించి ఉంచుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా చేరి వాసన మరింత పెరుగుతుంది. దుస్తులు ఉతికేటప్పుడు డిటర్జెంట్ పరిమాణాన్ని తగ్గించండి. దుస్తులు పిండే చివరి నిమిషంలో ఒక కప్పు తెల్ల వెనిగర్ లేదా కొద్దిగా డెటాల్ వేయండి. ఇది దుస్తుల్లోని బ్యాక్టీరియాను చంపి దుర్వాసనను దూరం చేస్తుంది.
నీటిని పిండేయండి: దుస్తులు త్వరగా ఆరాలంటే వాటిలో అస్సలు నీరు ఉండకూడదు. ఒకవేళ మీరు వాషింగ్ మెషీన్ వాడుతుంటే, దుస్తులు ఉతికిన తర్వాత మరోసారి ఎక్స్ ట్రా స్పిన్ సైకిల్ రన్ చేయండి. చేత్తో ఉతికే వారైతే నీరు లేకుండా గట్టిగా పిండేయాలి. దీనివల్ల దుస్తుల్లోని 90శాతం నీరు పోయి ఇంట్లోనే ఫ్యాన్ కిందనైనా త్వరగా ఆరిపోతాయి.
జాగ్రత్త మరి: వర్షం పడుతున్నప్పుడు దుస్తులను ఇంట్లోనే ఆరబెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు వంటగది, బాత్రూమ్ వంటి తేమ ఎకువగా ఉండే ప్రదేశాలలో వాటిని ఆరేయొద్దు. కిటికీల పకన, గాలి బాగా ఆడే హాల్లో లేదా నేరుగా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. దుస్తుల మధ్య తగినంత గ్యాప్ ఉంచడం వల్ల గాలి తగిలి త్వరగా ఆరుతాయి. చాలామంది ఒకదానిమీద మరోటి వేస్తారు. దీంతో బట్టలు కంపు వాసన కొడతాయి.
తేమను తగ్గించే చిటాలు: గదిలో తేమ శాతం ఎకువగా ఉంటే బట్టలు అస్సలు ఆరవు. మీ ఇంట్లో ఎయిర్ కండీషనర్ ఉంటే దాన్ని డ్రై మోడ్లో ఉంచడం ద్వారా గదిలోని తేమను తగ్గించవచ్చు. ఒకవేళ ఏసీ లేకపోతే, దుస్తులు ఆరబెట్టిన స్టాండ్ కింద ఒక గిన్నెలో రాతి ఉప్పు ఉంచండి. ఇది గాలిలోని తేమను పీల్చేసుకుంటుంది. అలాగే దుస్తుల అల్మారాల్లో సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచడం వల్ల దుస్తులు ఎప్పుడూ డ్రైగా ఉంటాయి. వాసన కూడా రావు.