సింగిల్ చైల్డ్ పర్లేదా?
నేనొక గృహిణిని. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో బిడ్డకు వెళ్లాలా, వద్దా అనే ప్రశ్న నన్నూ నా భర్తనూ వేధిస్తున్నది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారు సింగిల్ చైల్డ్కే పరిమితం అవుతున్నారు.
నేనొక గృహిణిని. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో బిడ్డకు వెళ్లాలా, వద్దా అనే ప్రశ్న నన్నూ నా భర్తనూ వేధిస్తున్నది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారు సింగిల్ చైల్డ్కే పరిమితం అవుతున్నారు. ఎటూ ఇంట్లోనే ఉంటున్నప్పుడు.. ఇంకొకరి కోసం ప్రయత్నిస్తే మంచిదని చాలామంది సలహా ఇస్తున్నారు. నాకేమో అంత ఓపిక లేదు. సింగిల్ చైల్డ్ పెంపకంలో సమస్యలు ఉంటాయా? నా సందేహం తీర్చగలరు.
ఓ పాఠకురాలు
అసలు పిల్లలే వద్దనుకోవడం, ఒకరే చాలనుకోవడం, ఇద్దరైతే బావుండని నిర్ణయించుకోవడం.. నూటికి నూరుశాతం వ్యక్తిగత విషయాలు. ‘సింగిల్ చైల్డ్’ పెంపకంలో ఉన్నట్టే, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లల్ని పెంచడంలోనూ సమస్యలు ఉంటాయి. ఏదీ గిరిగీసినట్టు చెప్పలేం. ఒకే బిడ్డ ఉన్నప్పుడు, ఖర్చులు సహజంగానే తక్కువగా ఉంటాయి. మంచి స్కూల్లో చదివించుకోవచ్చు. ఖరీదైన బట్టలు షాపింగ్ చేయొచ్చు. తరచూ టూర్లకు తీసుకెళ్లొచ్చు. పుట్టినరోజు లాంటి వేడుకలు ఘనంగా జరుపుకోవచ్చు. ఆర్థికంగా ఆసరా ఇచ్చి.. బిడ్డ తన కలను నిజం చేసుకునే అవకాశం ఇవ్వొచ్చు. మహానగర జీవితాల్లో ఇద్దరిద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడం కూడా సవాలే.
ఒక బిడ్డతో ఆ ఇబ్బంది ఉండదు. ఇక పరిమితులు అంటారా.. ఒక్కరే ఉంటారు కాబట్టి ఆలోచనల్ని, ఆహారాన్ని పంచుకోడానికి ఓ తోడు లేకపోవడం వెలితే. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి, మీవారి ఉద్యోగ స్వభావాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. తోబుట్టువులు లేని పిల్లలు నిస్సందేహంగా ఆ ప్రేమను కోల్పోతారు. ఆ
వెలితిని.. సామాజిక జీవనం ద్వారా పూడ్చవచ్చు. ఇరుగుపొరుగుతో స్నేహంగా, ప్రేమగా ఉండేలా వారిని తీర్చిదిద్దవచ్చు. పంచుకోవడంలోని గొప్పదనాన్ని ఉగ్గుపాలతో నూరిపోయవచ్చు. ఈ సూత్రాలన్నీ మీ పెంపకంలో భాగం అయితే.. బిడ్డకు ఒంటరి భావన ఉండదు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Children
- Housewife
- singlechild
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

