పార్టీలు, ఫంక్షన్లలో చుట్టూ ఉన్నవాళ్లను కనికట్టుచేసే దుస్తులనే ఎంచుకుంటారు అమ్మాయిలు. అలాంటి సందర్భానికి అచ్చంగా సరిపోతుందీ లేతవన్నెల డ్రెస్. అందులోనూ టర్టిల్ నెక్‌తో, వదులైన చేతులతో, బాడీపార్ట్ ఎంబ్రాయిడరీతో.. లేటెస్ట్ ఫ్యాషన్‌కు చిరునామాలా కనిపిస్తున్నది టాప్.
ఇక, ఫిష్‌కట్ స్కర్ట్‌పై వాలుగా వచ్చిన కుచ్చులు వయ్యారంగా ఒంపుసొంపుల్ని ఒలకబోస్తున్నాయి. ఈ వస్త్రధారణకు లైట్ మేకప్ జోడైతే జోరు మీదే.