మైక్రో కనెక్షన్స్.. కొత్తబంధం
ఒకప్పుడు బలమైన బంధం అంటే గంటల తరబడి కలిసి గడపడం, ప్రతిరోజూ ఫోన్లో ఎకువసేపు మాట్లాడటమే అనుకునేవాళ్లు. కానీ, వేగంగా మారుతున్న జీవనశైలిలో సంబంధాల అర్థం కూడా మారుతున్నది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘మైక్రో కనెక్షన్స్' అనే భావనకు ఆదరణ పెరుగుతున్నది.
ఒకప్పుడు బలమైన బంధం అంటే గంటల తరబడి కలిసి గడపడం, ప్రతిరోజూ ఫోన్లో ఎకువసేపు మాట్లాడటమే అనుకునేవాళ్లు. కానీ, వేగంగా మారుతున్న జీవనశైలిలో సంబంధాల అర్థం కూడా మారుతున్నది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘మైక్రో కనెక్షన్స్’ అనే భావనకు ఆదరణ పెరుగుతున్నది. అంటే రోజులో కొద్ది క్షణాలనైనా ఆప్యాయంగా పంచుకోవడం ద్వారా బంధాలను సజీవంగా ఉంచడం ఇందులోని విషయం.
ఉదాహరణకు ఉదయం
ఒక ప్రియమైన సందేశం పంపడం, పనిలో బిజీగా ఉన్నా కూడా ‘భోజనం చేశావా?’ అని అడగడం, ఇంటికి వెళ్లేటప్పుడు ఇష్టమైన చిరుతిండి తీసుకెళ్లడం, వారానికి ఒకసారి కలిసి టీ తాగడం, మాట్లాడేటప్పుడు ఫోన్ పకన పెట్టి పూర్తిగా ఎదుటివారిపైనే దృష్టి పెట్టడం… ఇవన్నీ చిన్న విషయాలే. కానీ బంధాన్ని బలపరిచే పెద్ద పెట్టుబడిగా మారుతున్నాయి. సంబంధాల్లో విలువైనది ఎంత సమయం అన్నది కాదని, ఆ టైమ్‌లో చూపించే శ్రద్ధేనని జీవనశైలి నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఐదు నిమిషాలు అయినా మనస్ఫూర్తిగా మాట్లాడితే, గంటసేపు పరధ్యానంగా గడిపిన సమయం కంటే ఎకువ అనుబంధం పెరుగుతుందని వారు అంటున్నారు.
ప్రస్తుతం కుటుంబాల్లోనూ, స్నేహితుల మధ్యా, దాంపత్య జీవితంలోనూ ఈ చిన్న చిన్న ఆప్యాయతలకు మళ్లీ ప్రాధాన్యం పెరుగుతున్నది. ఖరీదైన బహుమతుల కంటే ఒక మంచి మాట, ఒక చిరునవ్వు, ఒక పలకరింపు, ఒక క్షేమ సమాచారం… ఇవే బంధాలను ఎకువకాలం నిలబెడుతున్నాయని ఎందరి అనుభవాలో చెబుతున్నాయి. నిజమే, బంధానికి విలువైన బాటలు వేసేది ప్రతిరోజూ పంచుకునే చిన్నచిన్న ఆత్మీయ క్షణాలే మరి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

