వడాపావ్ మీదొట్టు.. అందుకే పచ్చబొట్టు
ఢిల్లీ స్ట్రీట్‌ఫుడ్‌లో వడాపావ్ ఫేమస్. ఆ చిరుతిండితో సెలబ్రెటీ హోదా పొందింది చంద్రికా దీక్షిత్. రాజధాని నగరంలో రుచికరమైన వడాపావ్ వండి వడ్డించి లోకల్ స్టార్ అనిపించుకుందామె. తన పనితనాన్ని ఇన్‌స్టాలో రీల్స్‌గా షేర్ చేస్తూ షేర్నీగా ఎదిగింది.
ఢిల్లీ స్ట్రీట్‌ఫుడ్‌లో వడాపావ్ ఫేమస్. ఆ చిరుతిండితో సెలబ్రెటీ హోదా పొందింది చంద్రికా దీక్షిత్. రాజధాని నగరంలో రుచికరమైన వడాపావ్ వండి వడ్డించి లోకల్ స్టార్ అనిపించుకుందామె. తన పనితనాన్ని ఇన్‌స్టాలో రీల్స్‌గా షేర్ చేస్తూ షేర్నీగా ఎదిగింది. ‘వడాపావ్ గాళ్’గా పేరు తెచ్చుకున్న చంద్రిక ప్రస్తుతం బిగ్‌బాస్ ఓటీటీ 3లో పోటీదారుగా అభిమానులను అలరిస్తున్నది. ఇంతవరకు బాగానే ఉన్నా… ఆమెపై కిలోల కొద్దీ అభిమానం పెంచుకున్న ఓ యువకుడు చంద్రిక ముఖారవిందాన్ని తన చేతిపై టాటూగా వేయించుకున్నాడు.
పచ్చ పొడిపించుకుంటున్న సన్నివేశాన్ని కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆమె చిత్తరువు కింద బిగ్‌బాస్ విన్నర్ అని కూడా రాసుకున్నాడు. ఇదేం విడ్డూరమని నెటిజన్లు వింత వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇంతకీ అతగాడికి ఆమెలో నచ్చింది ఏంటని ఆరా తీస్తే.. బలమైన కారణమే వెల్లడైంది. వడాపావ్ అమ్మకాల ద్వారా తను రోజుకు రూ.40 వేలు సంపాదిస్తానని బిగ్‌బాస్ షోలో చంద్రిక చెప్పుకొచ్చింది.
కోటి విద్యలూ కూటి కొరకే! అని పెద్దల మాట. పెద్దగా చదువుకోకపోయినా చంద్రిక స్వశక్తితో ఈ రేంజ్లో సంపాదిస్తుండటం మనవాడికి ముచ్చటగా అనిపించింది. సరైన ఉద్యోగం లేక వ్యవస్థను తప్పుబట్టే తనలాంటి వాళ్లకు చంద్రిక ఆదర్శమని ఫీలయ్యాడు. ఇంకేముంది తన స్ఫూర్తి మూర్తిని చేతిపై టాటూగా వేయించుకొని ‘ఆవిడే నా గురువు’ అని ఇన్‌స్టా హ్యాండిల్లో రాసుకొచ్చాడు. కష్టపడి పనిచేసేవారిని ఆదర్శంగా తీసుకోవడం మంచిదే! అయితే, బిగ్‌బాస్ ఓటీటీ 3ని ఫాలో అవుతున్నవాళ్లు మాత్రం ఈ ఉదంతానికి వింత భాష్యం చెబుతున్నారు.
బిగ్‌బాస్ ఓటర్లను ప్రభావితం చేయడానికే చంద్రిక ఇలాంటి ట్రిక్ ప్లే చేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై చంద్రిక ఘాటుగానే స్పందించింది. ‘నేను వడాపావ్ అమ్మకాలు ఏడాది కిందటో, రెండేండ్ల ముందో మొదలుపెట్టలేదు. పాతికేండ్లుగా వడాపావ్ నా జీవనాధారం. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. నాకు చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు’ అని కౌంటర్ అటాక్ చేసింది. ఈ సంగతులు ఎలా ఉన్నా… సదరు అభిమాని చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. దాదాపు కోటిన్నరకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇదంతా వడాపావ్ గాళ్ సత్తాను తెలియజేస్తున్నదని బిగ్‌బాస్‌లో ఆమె ఫాలోవర్స్ తెగ సంబురపడిపోతుండటం కొసమెరుపు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

