Health Tips | ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడ్డారా.. అజినమోటో ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాల్సిందే!
Health Tips | అజినమోటో.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కనిపించే పదార్థం. నూడుల్స్‌లో అయితే తప్పనిసరి. మోనోసోడియం గ్లుటమేట్.. ఎమ్ఎస్జీగా పిలుచుకునే ఓ రసాయనం ఇది. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

అజినమోటోకు తలనొప్పి కలిగించే లక్షణం ఉంది. అది కూడా అప్పుడప్పుడూ వచ్చిపోయే చిన్నపాటి శిరోభారం కాదు. తరచూ తీవ్రంగా వేధించే మైగ్రేన్ లాంటి సమస్యకు ఇది దారి
తీస్తుందట.
గుండె మీద కూడా అజినమోటో ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. హృదయ స్పందనను అస్తవ్యస్తం చేయగలదని హెచ్చరిస్తున్నారు.
నాడీ వ్యవస్థ మీద కూడా పనిచేస్తుందట. నరాలు చైతన్యాన్ని కోల్పోవడం, ఒళ్లంతా మొద్దుబారినట్టు అనిపించడం, పొట్టలో మంట.. తదితర లక్షణాలు కనిపిస్తాయట.
మహిళల్లో సంతానోత్పత్తి మీద ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. శిశువులు కూడా ఈ ఉత్పత్తులకు దూరంగా ఉండాలనే హెచ్చరికలు ఉన్నాయి.
అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ సమస్య, ఊబకాయం .. వగైరా ఇబ్బందులు అజినమోటో వైపే వేలెత్తి చూపుతాయి.
కాకపోతే ఇవన్నీ ప్రాథమిక అంచనాలే. మోతాదుకు మించి తీసుకున్నప్పుడు మాత్రం కచ్చితంగా చెడు ప్రభావం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.