Sarees | చీరతో లంగావోణీ
Sarees | చీరకట్టు సహజంగానే అందంగా ఉంటుంది. దాన్ని మరింత నవీనంగా తీర్చిదిద్దేలా, సంప్రదాయ చీరకు ైస్టెలిష్ లుక్ తీసుకువచ్చేలా.. కొత్తకొత్త చీరకట్లు ట్రెండవుతున్నాయి. యూనిక్ శారీ డ్రేపింగ్ ైస్టెల్స్ పేరుతో పాపులర్ అవుతున్నాయి. చీరను లంగావోణీలా, ఫ్యాషనబుల్ గౌన్లా, లెహెంగా జాకెట్లా.. కనికట్టు చేస్తూ కట్టడమెలాగో చెబుతున్నాయి. ఈ యూట్యూబ్ పాఠాలు ఆడపిల్లలను చూడచక్కని మార్చ్ఫాస్ట్కు సిద్ధం చేస్తున్నాయి.
Sarees | చీరకట్టు సహజంగానే అందంగా ఉంటుంది. దాన్ని మరింత నవీనంగా తీర్చిదిద్దేలా, సంప్రదాయ చీరకు ైస్టెలిష్ లుక్ తీసుకువచ్చేలా.. కొత్తకొత్త చీరకట్లు ట్రెండవుతున్నాయి. యూనిక్ శారీ డ్రేపింగ్ ైస్టెల్స్ పేరుతో పాపులర్ అవుతున్నాయి. చీరను లంగావోణీలా, ఫ్యాషనబుల్ గౌన్లా, లెహెంగా జాకెట్లా.. కనికట్టు చేస్తూ కట్టడమెలాగో చెబుతున్నాయి. ఈ యూట్యూబ్ పాఠాలు ఆడపిల్లలను చూడచక్కని మార్చ్ఫాస్ట్కు సిద్ధం చేస్తున్నాయి.
చీర కట్టుకోవాలంటే చీర కావాలి, లంగావోణీ వేసుకోవాలంటే లంగావోణీనే ఉండాలి… అనుకుంటే ఇప్పుడు తప్పే. పర్ఫెక్ట్ లంగావోణీని చీరతోనూ కట్టొచ్చు. అదే చీరతో మాడ్రన్ డ్రెస్‌నూ సృష్టించొచ్చు. లాంగ్గౌన్నూ ఆవిష్కరించొచ్చు. ‘ఇలా ఎలా కట్టారబ్బా?’ అనిపించేలా మత్స్యకన్యను తలపిస్తూ మెర్మెయిడ్, రివర్స్ మెర్మెయిడ్ ైస్టెళ్లనూ ట్రై చేయొచ్చు. ఇప్పుడవన్నీ ప్రయత్నించేందుకు ఒక్క చీర ఉంటే చాలు. యూట్యూబ్‌లో చూసి మీకు నచ్చిన వస్త్రధారణలో ముస్తాబయిపోవచ్చు.
ఎన్ని రకాలో…
యూట్యూబ్… ముచ్చటైన వంటిల్లు, పాటల పొదరిల్లు, ముగ్గుల హరివిల్లు, కొత్త సంగతుల చిరుజల్లు. ఇప్పుడు సంప్రదాయ చీరకట్టును సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నది. చీరను విభిన్నంగా మడతపెడుతూ రకరకాల దుస్తుల రూపాలు ఎలా తీసుకురావాలో చూపుతున్నది. ఉదాహరణకు మనకు బాగా ఇష్టమైన లంగావోణీనే తీసుకుందాం. లోపలి వరుస చీరను నడుం దగ్గర దోపి రెండో వరుసను మళ్లీ నడుం దాకా తీసుకువచ్చి కుచ్చులు పోసి చీరకడతాం. దాని బదులు… ఇందులో, చుట్టూ చీరను ఒక్కో కుచ్చూ పెడుతూ దాన్ని దోపుతూ ఫ్రిల్స్తో వచ్చే లంగాలా కనిపించేలా చేస్తారు. తర్వాత పవిటకు పిన్ను పెట్టి నడుం దగ్గరి చీరను ఓణీ అంచులా దోపుతారు. ఇంకేం, అది చీర అని చెబితేగానీ అర్థం కానంతగా.. అచ్చమైన లంగావోణీలా కనిపిస్తుంది. వెస్ట్రన్ డ్రెస్ తరహాలో కనిపించే చీరకట్లూ ఉన్నాయి. ప్రతి ఫంక్షన్‌కీ ఒకేలాంటి చీర బోర్ కొట్టినప్పుడు ఇలా ప్రయత్నిస్తే సరి… ఏమంటారు?!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video








