Alia Bhatt | ముప్పయ్యేండ్ల ముచ్చటైన చీర..
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కట్టిన ఓ చీర ఈ మధ్య అంతర్జాతీయ వేదిక మీద తళుకులీనింది. చక్కనమ్మ ఏం కట్టినా చక్కగానే ఉంటుందన్న ప్రశంసల్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రఖ్యాత డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాలు 1994లో... అంటే ముప్పై ఏండ్ల క్రితం దీన్ని రూపొందించారు.
Alia Bhatt | బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కట్టిన ఓ చీర ఈ మధ్య అంతర్జాతీయ వేదిక మీద తళుకులీనింది. చక్కనమ్మ ఏం కట్టినా చక్కగానే ఉంటుందన్న ప్రశంసల్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రఖ్యాత డిజైనర్లు అబు జానీ, సందీప్ ఖోస్లాలు 1994లో… అంటే ముప్పై ఏండ్ల క్రితం దీన్ని రూపొందించారు. గోధుమ వన్నెలోని ఈ ఎంబ్రాయిడరీ లేస్ చీరను తీర్చిదిద్దేందుకు 3500 గంటల సమయం పట్టిందట.
పట్టి చూస్తే ఇందులోని ప్రతి పోగూ కళాత్మకమే అంటారు ఫ్యాషన్ ప్రియులు. దీనికి జతగా హాల్టర్ నెక్ రవిక, పచ్చల బుద్దులు ధరించి ముగ్ధ మనోహరంగా కనిపించింది అలియా. లండన్లో జరిగిన ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఇలా మెరిసింది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- fashion
- saree
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

