గృహాలంకరణ కొత్తపుంతలు తొక్కుతున్నది. అంతర్జాతీయ దిగ్గజం ‘ల్యాడ్రో’ పక్షి జాతుల నమూనాలతో అందమైన పోర్స్లిన్ బొమ్మలు తయారు చేస్తున్నది. అన్నీ చేతితో ప్రాణం పోసినవే. ఎక్కడా యంత్రాలు ఉపయోగించలేదు. అందుకే అంత సహజత్వం, ఇంత జీవకళ సాధ్యమైంది. వీటికి పెట్టిన పేరు ‘ప్యారెట్ కలెక్షన్’. బహుమతిగానూ ఇవ్వొచ్చు. ధరలు లక్షల్లోనే. సంస్థ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా విక్రయిస్తారు.