ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మేదరి వీరప్రతాప్
గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి గ్రామపంచాయతీ సర్పంచ్ మేదరి వీరప్రతాప్(టోనీ) తెలిపారు.
కారేపల్లి, నవంబర్ 16 : గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి గ్రామపంచాయతీ సర్పంచ్ మేదరి వీరప్రతాప్(టోనీ) తెలిపారు. సోమవారం కారేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సింగరేణి గ్రామపంచాయతీ పరిధిలో వితంతు, వికలాంగుల పెన్షన్ల కోసం మొత్తం 85 మంది దరఖాస్తు చేసుకోగా, పరిశీలన అనంతరం 58 మందికి పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు.
అదేవిధంగా గ్రామపంచాయతీ పరిధిలోని 1,684 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెన్షన్లు,రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పెద్దమ్మ భాగ్యలక్ష్మి, కార్యదర్శి నెహ్రు, వార్డు సభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది,లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇటీవల నిన్ను విన్న జోకుల్లో ఇదే బెస్ట్.. ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్
AR Constable | గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
Hostel gate | మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకే ప్రయత్నం.. ఇనుప రాడ్డు చేతిలో దిగి యువకుడి నరకయాతన
అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పెన్షన్స్ అందించాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
Ramayanam | రామాయణం బాక్సాఫీస్ సునామీ.. సెకండ్ సండే రూ.75 కోట్ల వసూళ్లు,ధురంధర్ 2 రికార్డు బద్దలు!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

