లక్కీ చాన్స్.. నేడే చూడండి
‘లక్కీ చాన్స్. నేడే చూడండి. మీ అభిమాన నటుడి సినిమా’.. ‘ఓటరు మహశయులారా ఈ ఎన్నికల్లో ప్రజాసేవకుడిగా మీ ముందుకొస్తున్న అభ్యర్థినే గెలిపించండి’.. ‘బంపర్ ఆఫర్.. ఒక్క షర్ట్ కొంటే మరొకటి ఫ్రీ’ అని ఒకప్పుడు వీధుల్లో, వ్యాపార వాణిజ్య సముదాయాల వద్ద వినిపిం చిన వాయిస్ గుర్తుందా.
- మీ అభిమాన నటుడి సినిమా
- ఎల్లలుదాటిన సలీం వాయిస్
- సినిమా, వ్యాపారం, ఎన్నికల్లో ఆయన గళమే ప్రధానం
- వ్యాఖ్యాతగా ఐదు దశాబ్దాల ప్రస్థానం
- త్వరలోనే ‘స్వర’ స్వర్ణోత్సవం
- సర్వత్రా హర్షం
‘లక్కీ చాన్స్. నేడే చూడండి. మీ అభిమాన నటుడి సినిమా’.. ‘ఓటరు మహశయులారా ఈ ఎన్నికల్లో ప్రజాసేవకుడిగా మీ ముందుకొస్తున్న అభ్యర్థినే గెలిపించండి’.. ‘బంపర్ ఆఫర్.. ఒక్క షర్ట్ కొంటే మరొకటి ఫ్రీ’ అని ఒకప్పుడు వీధుల్లో, వ్యాపార వాణిజ్య సముదాయాల వద్ద వినిపిం చిన వాయిస్ గుర్తుందా..? మన సిరిసిల్ల పట్టణానికి చెందిన సలీం వాయిస్ అది. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో మంచి వ్యాఖ్యాతగా 5 దశాబ్దాలుగా సేవలందిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గళమది. ముఖ్యంగా వాణిజ్య, వ్యాపా ర ప్రచారాస్ర్తాలుగా మారిన ఆయన స్వరం త్వరలోనే స్వర్ణోత్సవం జరుపు కొంటున్న వేళ ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
– రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ)
సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎండీ సలీంది పేద కుటుంబం. చిన్న టెంట్‌హౌస్ షాప్ పెట్టుకొని జీవిస్తున్నాడు. ప్రముఖ గాయకుడు ఘంటసాల అంటే ఆయనకు బాల్యం నుంచే ఎనలేని అభిమానం. ఈ క్రమంలో తన షాప్ లో ఓ గదిని రికార్డ్ రూంగా ఏర్పాటు చేసుకున్నాడు. తన 14ఏళ్ల వయసులో సినిమాల ప్రచారాన్ని ప్రారంభించాడు. కొత్త సినిమా రాగానే రిక్షాకు మైకు కట్టి ‘నేడే చూడండి.. మీ అభిమాన నటుడు ఎన్టీ రామారావు నటించిన పాతాళాబైరవి. మన లక్ష్మీటాకీస్లో.. రోజు రెండు ఆటలు’ అంటూ సలీం 1974లో తొలి సినిమా ప్రచార వ్యాఖ్యాతగా ఆరంగేట్రం చేశాడు. వాయిస్ బాగా ప్రాచుర్యం పొందడంతో వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించి ప్రకటనలు యజమాన్యాలు ఆయన స్వరంతోనే చేయించుకునేవి.
సర్కస్, ఎగ్జిబిషన్, ఆలయాల్లో స్వామి వారి కైంకర్య సేవల వివరాలకూ ఆయన వాయిస్సే ఇచ్చేవారు. క్యాసెట్ల రూపంలో రికార్డు చేసి దినదినం ప్రసారం చేసుకునేవారు. నాటి రోజుల్లో అత్యంత ప్రజాధరణ పొందిన భాగ్యలక్ష్మి లక్కీ లాటరీ ఉమ్మడి ఆంధ్రపదేశ్ అంతటా విస్తృతంగా ప్రచారం జరిగింది సలీం స్వరమేనని చెప్పక తప్పదు. బీడీలు, సిగరెట్, పాన్మసా లా, టీవీలు, రేడీయోలు, కరెంటు బిల్లులు, నల్లాబిల్లులు, ‘ఇంటి పన్నులు సకాలంలో చెల్లించండి’ అంటూ ఇలా ప్రతి ప్రచారంలో ఆయన స్వరమే తప్పసరిగా ఉండేది.
పార్టీలు ఏవైనా ప్రచార గళం ఒక్కటే..
ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రచారం వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు సలీం వద్దకు క్యూ కట్టేవారు. తమకు నచ్చిన ప్రకటనలకు ఆయనతో క్యాసెట్లు చేయించుకునేవారు. గుర్తు, పార్టీ, పోటీచేస్తున్న నియోజకవర్గం రాసి ఇస్తే చాలు, అందమైన భాషతో జనాన్ని ఆకట్టుకునేలా అద్భుతంగా తన ప్రచారం క్యాసెట్లు తయారు చేసి ఇచ్చేవాడు. సర్పంచ్ నుంచి మొదలు, వార్డు మెంబర్, ఎమ్మెల్యే, ఎంపీ ఏ ఎన్నికల ప్రచార ప్రకటనలైనా సలీం గళం ఉండి తీరేది.
కేటీఆర్, కేసీఆర్‌లతో పాటు వందల సంఖ్యలో రాజకీయ నాయకుల ప్రచారానికి వినియోగించింది సలీం గళమే. ఒక్క తెలంగాణే కాదు కర్నాటక, ఆంధ్ర, మహరాష్ట్ర వాసులకు ఆయన గళం సుపరిచితమే. ఇలా తనదైన శైలిలో ప్రచార గళాన్ని వినిపిస్తున్న సలీంది 5 దశాబ్దాల ప్రస్థానం. అనేక అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాకుండా సినీతారలు, రాజకీయ నాయకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కంచుకంఠతో అందరినీ ఇట్టే ఆకుట్టుకునే సలీం స్వరం త్వరలో స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

