Godavarikhani | జాతి వైరం ఓడింది.. అమ్మతనం గెలిచింది.. గోదావరిఖనిలో మానవత్వపు మనుషులను కదిలించిన అరుదైన దృశ్యం
అమ్మతనం ముందు జాతి వైరం ఓడిపోయింది. గోదావరిఖని మార్కండేయ కాలనీలో మంగళవారం ఈ అరుదైన దృశ్యం మానవత్వపు మనుషులను కదిలించింది. సహజంగా శునకం.. వానరం తారసపడితే అక్కడ ఓ యుద్ధమే జరుగుతోంది.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 10 : అమ్మతనం ముందు జాతి వైరం ఓడిపోయింది. గోదావరిఖని మార్కండేయ కాలనీలో మంగళవారం ఈ అరుదైన దృశ్యం మానవత్వపు మనుషులను కదిలించింది. సహజంగా శునకం.. వానరం తారసపడితే అక్కడ ఓ యుద్ధమే జరుగుతోంది. వాటి మధ్య ఉన్న జాతీ వైరం అలాంటిది. కానీ అమ్మ లేని ఓ కోతి పిల్లను చూసిన శునకంకు తనలోని అమ్మ తనమే స్పురణకు వచ్చింది. జాతీ వైరం పక్కనపెట్టి కోతి పిల్లను తన సొంత బిడ్డల అక్కున చేర్చుకుంది. జంతువులలో కూడా నిస్వార్థమైన ప్రేమ, మాతృత్వం ఉంటుందని నిరూపించింది.
మంగళవారం ఉదయం గోదావరిఖని మార్కండేయ కాలనీలోని గణేష్ నగర్ బోర్డు వద్ద కాటగలిసిన కోతి పిల్ల బిక్కుబిక్కుమంటూ కనిపించగా, అది చూసిన శునకం ఇతర కుక్కల నుంచి రక్షణ గా ఆ కోతి పిల్లను అమ్మలా తన భుజం పైకి ఎక్కించుకొని అటు ఇటు తిప్పుతూ లాలించింది. ఇది చూసిన ఓ ఫొటో గ్రాఫర్ పోచంపల్లి తిరుపతి ఆ కుక్కకు కడుపునిండా అన్నం పెట్టాడు. ఆ తర్వాత కోతి పిల్ల తో వీధుల్లో విహరింపజేసింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు మాతృత్వం గొప్ప తనానికి తలవంచిపోయారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Dog
- Godavarikhani
- monkey
- motherhood
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
‘సీతారామ నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి’
శ్రీజ కుటుంబ సభ్యులకు కేటీఆర్ భరోసా
BRS MLAs | కీచక వైస్ చాన్సలర్ మీద చర్యలు తీసుకోవాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Sonia Gandhi: ఇందిరా గాంధీ కోపం.. కుర్చీలో వణికిపోయేదాన్ని : సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

