చీరెలు కొంటడు.. ఉడాయిస్తడు
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రోజుకో తరహాలో ఆన్లైన్ మోసాలు భయపెడుతున్నాయి. కొద్ది రోజులుగా ఫేక్ ఫోన్‌పే ఫ్రాడ్స్ కలవరపెడుతున్నాయి.
- ఫోన్‌పేలో డబ్బులు పంపిస్తానని మోసం
- ఫేక్ మెసేజ్ చూపి గాయబ్
- ఇది కేటుగాడి ైస్టెల్
- తాజాగా జగిత్యాలలో అరెస్ట్
జగిత్యాల, జూలై 16 : ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రోజుకో తరహాలో ఆన్లైన్ మోసాలు భయపెడుతున్నాయి. కొద్ది రోజులుగా ఫేక్ ఫోన్‌పే ఫ్రాడ్స్ కలవరపెడుతున్నాయి. మహిళలు నడిపించే షాపులను టార్గెట్ చేసి, చీరలో.. మరే వస్తువో కొని.. డబ్బులు పంపానని ఫేక్ మెసేజ్ చూపి గాయబ్ అవుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి తరహాలోనే మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని తాజాగా జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వివరాలను టౌన్ సీఐ వేణుగోపాల్ వెల్లడించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన రామగిరి సురేశ్ నయా మోసానికి తెరతీశాడు.
శుక్రవారం నంబర్‌ప్లేట్ లేని పల్సర్‌పై జగిత్యాలలో ఒక బట్టల షాపునకు వెళ్లాడు. 2200 విలువైన మూడు చీరెలను కొనుగోలు చేశాడు. తన వద్ద నగదు డబ్బులు లేవని, ఫోన్‌పే చేస్తానని చెప్పాడు. అలాగే తనకు డబ్బులు అత్యవసరం ఉందని మరో 7800 తీసుకున్నాడు. మొత్తం 10 వేలు పంపిస్తానని చెప్పాడు. స్కానర్‌తో పంపితే రావడం లేదని, ఇంకో ఫోన్ నంబర్ చెప్పాలని యాజమానురాలిని అడిగాడు. ఆమె మరో నంబర్ చెప్పడంతో డబ్బులు పంపించానని ఫేక్ మెసేజ్ చూపించి ఉడాయించాడు. తన భర్త వచ్చిన తర్వాత ఫోన్‌పేలో డబ్బులు వచ్చాయా..? అని అడగ్గా.. రాలేదని చెప్పడంతో మోసపోయామని గ్రహించారు. ఆదివారం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం విద్యానగర్ బైపాస్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న సురేశ్‌ను పట్టుకుని విచారించారు. అతడి వద్ద నుంచి 5వేలు నగదును రికవరీ చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

