Kamanpur | కమాన్పూర్, జులై 10 : హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలో ఈనెల 7 నుండి 9 వరకు జరిగిన ఐదో తెలంగాణ పోలీస్ మీట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కూరపాటి శ్రీలత మూడు పతకాలను సాధించింది. ఇందులో కాళేశ్వరం జోన్ నుండి రామగుండం కమిషనరేట్ గోదావరిఖని టూ టౌన్ పరిధిలోగల కమాన్ పూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కూరపాటి శ్రీలత యోగా ట్రెడిషనల్ లో గోల్డ్ మెడల్ , యోగ ఆర్టిస్ట్ సింగిల్ లో సిల్వర్ మెడల్, యోగా రిత్విక్ పేర్ లో బ్రాంజ్ మెడల్, అలాగే యోగా ఆర్టిస్ట్ ఫెయిర్ మరొక బ్రాండ్ మెడల్ సాధించారు.
ఇందులో కాలేశ్వరం జోన్ రాజన్న సిరిసిల్ల జోన్ భద్రాద్రి కొత్తగూడెం బాసర జోన్ యాదాద్రి జోన్ చార్మినార్ జోన్ జోగులాంబా జోన్ నుండి పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు. పతకాలు సాధించిన వారికి మల్కాజ్ గిరి పోలీస్ అధికారులు మెడల్స్ అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీలత గతంలో హర్యానాలో జరిగిన జాతీయస్థాయి పోలీస్ మీట్ లో రాణించి బ్రాంచ్ పథకాన్ని సాధించారు. పతకాలు సాధించిన శ్రీలతను పలువురు అభినందించారు.