కుంచె కదిపితే అపు‘రూపమే’
ఆయన కుంచె కదిపితే కాన్వాస్‌పై అపురూప చిత్రాలు జాలువారుతాయి. ఆయన వేసిన ఏకరేఖ చిత్రాలు చూడముచ్చటగా ఉంటూ ఇట్టే ఆకట్టుకుంటాయి. అతడి ప్రతిభకు అనేక పురస్కారాలు వరించాయి. చిత్రకారుడిగా, లయన్స్‌క్లబ్ ప్రతినిధిగా సేవా కార్యక్రమాలే కాకుండా న్యాయవాదిగా రాణిస్తున్న చాప కిషోర్‌పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం
- ఏకరేఖ బొమ్మలు గీయడంలో దిట్ట కిషోర్
- ఆయన ప్రతిభకు అనేక పురస్కారాలు
- న్యాయవాదిగా, సామాజిక సేవలతో గుర్తింపు
కోరుట్ల రూరల్, జూలై 8: ఆయన కుంచె కదిపితే కాన్వాస్‌పై అపురూప చిత్రాలు జాలువారుతాయి. ఆయన వేసిన ఏకరేఖ చిత్రాలు చూడముచ్చటగా ఉంటూ ఇట్టే ఆకట్టుకుంటాయి. అతడి ప్రతిభకు అనేక పురస్కారాలు వరించాయి. చిత్రకారుడిగా, లయన్స్‌క్లబ్ ప్రతినిధిగా సేవా కార్యక్రమాలే కాకుండా న్యాయవాదిగా రాణిస్తున్న చాప కిషోర్‌పై ‘నమస్తే’ ప్రత్యేక కథనం
కోరుట్లకు చెందిన చాప కిషోర్‌కు విద్యార్థి దశ నుంచే చిత్రలేఖనం అంటే మక్కువ. కార్టూన్లను గీసి పలు మాసపత్రికలకు పంపేవాడు. అందరూ గీసే బొ మ్మలకు భిన్నంగా కొత్త దనం ఉట్టిపడేలా ఏకరేఖ చిత్రాలను గీయడం ఈయన ప్రత్యేకత. కిషోర్ గీసిన చిత్రా ల్లో తెలుగుదనం ఉట్టిపడేలా బాపూ బొమ్మవలె ఉంటాయని కళాభిమానులు చెబుతుంటారు. కొవిడ్ వేళ ఆయన గీసిన కార్టూన్, ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా చిత్రం. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా కేసీఆర్ చిత్రంతో గోల్కోండ కోటపై జాతీయజెండా మహాత్ముడితో కూడిన చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. ఈయన వేసిన పెయింటింగ్‌కు తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో యేటా ఇచ్చే మహానంది జాతీయ పురస్కారం అందుకున్నా రు. అలాగే ఈయన గీసిన చిత్రం అంతర్జాల మాసపత్రికైన కళా మాధురిలో జనవరి 2023, మార్చి 2023 లో అంతర్జాల మాసపత్రికలో కవర్పేజీల్లో ప్రచురితమయ్యాయి. అలాగే లయన్స్‌క్లబ్ అధ్యక్షుడిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులను పొందారు. 75 గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను ఏర్పాటు చేసి యువతకు చట్టాలపై అవగాహన కల్పించారు.
అవార్డులు..ప్రశంసలు..
- 1991లో ఆయన వేసిన అక్షర ఉజ్వలకు సంబంధించిన వేసిన చిత్రం ప్రథమ బహుమతిని పొందగా ఆ చిత్రంతో అప్పటి ప్రభుత్వం గ్రామాల్లో ప్రచారం చేపట్టింది.
- 1992 రూపం ఆర్ట్ నిర్వహించిన జిల్లా స్థాయి పెయింటింగ్‌లో ప్రథమ బహుమతి పొందారు.
- 2012లో యువజన దినోత్సవంలో ఉత్తమ సామాజికవేత్త కొండాలక్ష్మణ్ బాపూజి ఆవార్డును పొందారు.
- 2020 కరోనా పై వేసిన పెయింటింగ్‌లో శ్రీ కళాక్షేత్ర తిరుపతి వారిచే ప్రశంస పత్రాలు పొందారు.
- కార్టూన్, చిత్రలేఖనంలో ఔత్సాహితులకు ప్రోత్సాహకంగా 1992 నుంచి రాష్ట్ర పోటీలను నిర్వహించి బహుమతులను అందించారు.
- చిత్రలేఖనం, కార్టూన్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఫన్నీ క్లబ్ పేరిట ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, 2006 నుంచి యేటా చిత్ర పోటీలు నిర్వహిస్తూ బహుమతులను అందజేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

