BRS Social Media | వీణవంక, జూలై 5 : హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, కేటీఆర్ సేన సభ్యుడు ఎల్బాక గ్రామానికి చెందిన ఎడ్ల రాకేష్ శనివారం వీణవంక తహసీల్దార్ అంబటి రజిత, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మి నారాయణను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అధికారులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను కోరారు.