చరిత్రలో ఈరోజు: అంతరిక్ష చరిత్రలో నిలిచిపోయిన యూరీ గగారిన్
Today History: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా నిలిచిన యూరీ గగారిన్ 1934 లో సరిగ్గా ఇదే రోజు రష్యా సంయుక్త రాష్ట్రంలో జన్మించారు. కేవలం 27 ఏండ్ల వయసులోనే అంతిరిక్షంలోకి వెళ్లి ఖగోళశాస్త్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. యూరీ గగారిన్ యాత్రతో అంతరిక్ష విజ్ఞానంలో అమెరికాపై సోవియట్ రష్యా పైచేయి సాధించినట్లయింది.
సోవియట్ రష్యాలోని స్మోలెన్స్క్ ఒబ్లాస్ట్‌లోని క్లూషిన్ గ్రామంలో యూరీ గగారిన్ జన్మించారు. అతడి తల్లిదండ్రులు అలెక్సీ ఇవనోవిచ్ గగారిన్, అన్నా టిమోఫీవ్నా గగారిన్ సామూహిక వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేవారు. నలుగురు సంతానంలో యూరీ మూడవవాడు. గగారిన్ స్వస్థలం అనేక దండయాత్రలను, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆక్రమణ బాధలను ఎదుర్కొన్నది. 1941 లో నాజీలు క్లూషిన్ గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని నివాసితులను బానిసలుగా చేసుకున్నారు. 1946లో యూరీ కుటుంబం గ్జాత్స్క్కు వలస వెళ్లడంతో అక్కడ తన విద్యను కొనసాగించాడు. మోడల్ విమానాలను తయారు చేస్తున్న చిన్నారుల బృందంలో యూరీ భాగమయ్యాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్లూషిన్లో యాకోవ్లెవ్ యుద్ధ విమానం కుప్పకూలిన తర్వాత విమానాలపై అతడికి ఆసక్తి పెరిగింది. సరతోవ్ ఫ్లయింగ్ క్లబ్లో ఎయిర్ క్యాడెట్‌గా శిక్షణ పొందాడు. అక్కడ వారాంతపు శిక్షణ పొంది బైప్లేన్‌ను ఎగరడంలో నేర్పు సాధించాడు.
1955 లో యూరీ గగారిన్ ఓరెన్‌బర్గ్‌లోని చ్కలోవ్స్కీ హయ్యర్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ స్కూల్‌కు ఎంపికయ్యాడు. తొలుత యాక్-18పై, తర్వాత మిగ్-15 లో శిక్షణ పొందాడు. 1957 లో లెఫ్టినెంట్‌గా వైమానిక దళంలో చేరిన యూరీ.. 1961 లో వోస్టాక్-1లో అంతిరక్షయాత్ర చేసిన తొలి మానవుడిగా నిలిచిపోయారు. ఈయన 1 గంటా 48 నిమిషాల పాటు అంతరిక్షంలో గడిపి కొత్త చరిత్ర లిఖించుకున్నారు. హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్, ఆర్డర్ ఆఫ్ లెనిన్, పైలట్, కాస్మోనాట్ ఆఫ్ ది యూఎస్ఎస్ఆర్ అవార్డులను అందుకున్న యూరీ.. కేవలం 34 ఏండ్ల వయసులో విమాన శిక్షణ జరుపుతుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
ఇవాళ అంతర్జాతీయ ధూమపాన వ్యతిరేక దినం
- 2004: షాహీన్-2 క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్
- 1999: భారత సంతతి పారిశ్రామికవేత్త స్వరాజ్ పాల్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సెంట్రల్ బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం
- 1986: మొదటి ఉపగ్రహ ఆధారిత టెలిఫోన్ కనెక్టివిటీ నెట్వర్క్ అధికారికంగా ప్రారంభం
- 1967: రష్యాను విడిచి భారత్ చేరుకున్న స్టాలిన్ కుమార్తె స్వెత్లానా అల్లిలుయేవా
- 1959: న్యూయార్క్‌లోని అమెరికన్ టాయ్ ఫెయిర్‌లో తొలిసారి ప్రదర్శనకు వచ్చిన బార్బీ డాల్
- 1956: భారత దౌత్యవేత్త, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లండన్‌లో జననం
- 1951: ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ జననం
- 1945: టోక్యోపై అమెరికా బాంబులు వేసిన ఘటనలో దాదాపు 80 వేల మంది దుర్మరణం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

