US | అమెరికాలో చెత్త రాష్ట్రాలు ఇవే.. మౌళిక సదుపాయాల ఆధారంగా సీఎన్‌బీసీ ర్యాంకింగ్స్
అమెరికాకు వెళ్లి విద్యనభ్యసించాలని, మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అయితే 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో దేశమంతటా ఒకే విధమైన పరిస్థితులు లేవు. జీవన ప్రమాణాల విషయంలో పలు రాష్ట్రాలు ఎంతో ముందుండగా, మరికొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి.
US | అమెరికాకు వెళ్లి విద్యనభ్యసించాలని, మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటుంటారు. విద్య, వైద్యం సహా అనేక రంగాల్లో అక్కడ అత్యున్నత సదుపాయాలు ఉండటమే ఇందుకు కారణం. అయితే 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో దేశమంతటా ఒకే విధమైన పరిస్థితులు లేవు. జీవన ప్రమాణాల విషయంలో పలు రాష్ట్రాలు ఎంతో ముందుండగా, మరికొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. అమెరికాలో ఉద్యోగం చేసేందుకు, నివసించేందుకు ఏ రాష్ట్రం ఉత్తమమో నిర్ణయించుకునేందుకు విద్య, వైద్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సీఎన్‌బీసీ ర్యాంకులను కేటాయించింది. అందులో వరస్ట్ ఏ రాష్ట్రాలో చూద్దాం..
టెక్సాస్
అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో టెక్సాస్ మొదటిస్థానంలో ఉన్నది. ఇక్కడ మరో ప్రతికూలాంశం ఏమిటంటే సగటు ప్రైమరీ హెల్త్‌కేర్ ఫిజీషియన్లు అతి తక్కువగా ఉన్నారు. నేరాలు ఎక్కువ జరుగుతున్న రాష్ట్రాల్లో టెక్సాస్ 13వ స్థానంలో ఉన్నది.
ఓక్లహామా
ఇక్కడ డ్రగ్స్ వినియోగం ఎక్కువ. ఆరోగ్య బీమా లేని వారిలో టెక్సాస్ తర్వాతి స్థానం ఓక్లహామాదే.
లూసియానా
పిల్లల సంరక్షణ సదుపాయాల విషయంలో లూసియానా వెనుకబడి ఉంది. 46 లక్షల జనాభాకు గానూ కేవలం 76 లైసెన్స్డ్ చైల్డ్‌కేర్ ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి.
సౌత్ కరోలినా
ఉద్యోగం చేసేందుకు సౌత్ కరోలినా అంత సురక్షితం కాదు. వృత్తిపరమైన మరణాల్లో ఐదోస్థానంలో ఉన్నది. కార్మికులకు చట్టపరమైన రక్షణలు సరిగా లేవు. నేరాల శాతం కూడా ఎక్కువ.
అలబామా
కార్మికులకు చట్టపరమైన రక్షణలు సరిగాలేవు. అన్హెల్తీయెస్ట్ స్టేట్స్లో ఇదొకటి. ముందస్తు మరణాల్లో నాలుగోస్థానంలో ఉన్నది.
మిస్సౌరి
మెడికల్ ఎమర్జెన్సీ మినహా అన్ని అబార్షన్లపై ఇక్కడ నిషేధం ఉన్నది. క్రైమ్ రేటు కూడా ఎక్కువే.
ఇండియానా
లక్ష జనాభాకు గానూ ఇక్కడ 10 కూడా చైల్డ్‌కేర్ ఫెసిలిటీస్ లేవు. వివక్ష వ్యతిరేక చట్టాలు పరిమితమే.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- CNBC
- live
- United States
- work
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

