Woman, Daughter Bricked Into Wall | మహిళ, ఆమె కుమార్తెను గదిలో బంధించి.. గోడ కట్టిన బంధువులు
Woman, Daughter Bricked Into Wall | మహిళ, ఆమె కుమార్తెను గదిలో బంధించిన బంధువులు వారు బయటకు రాకుండా గోడ కట్టారు. దీంతో వారిద్దరూ ఆ గదిలో చిక్కుకుపోయారు. ఇది గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇస్లామాబాద్: మహిళ, ఆమె కుమార్తెను గదిలో బంధించిన బంధువులు వారు బయటకు రాకుండా గోడ కట్టారు. (Woman, Daughter Bricked Into Wall) దీంతో వారిద్దరూ ఆ గదిలో చిక్కుకుపోయారు. ఇది గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ గోడను పగులగొట్టి గదిలో బంధీలుగా ఉన్న మహిళ, ఆమె కుమార్తెను కాపాడారు. పాకిస్థాన్‌లోని సింధ్ జిల్లాలో ఉన్న హైదరాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. లతీఫాబాద్ నంబర్ 5 ప్రాంతంలో ఆస్తి తగాదాల వల్ల ఒక మహిళ, యుక్త వయసులో ఉన్న ఆమె కుమార్తెను బంధువులు ఒక గదిలో బంధించారు. వారు బయటకు రాకుండా ఆ గది బయట గోడ నిర్మించారు.
కాగా, పొరుగున ఉన్న వారు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు గదిని మూసేస్తూ కట్టిన గోడను పగులగొట్టారు. గది లోపల నిర్బంధించిన తల్లీకుమార్తెలను కాపాడారు.
మరోవైపు ఇంటిని కాజేసేందుకు బావ సుహైల్, అతడి కుమారులు తమను వేధిస్తున్నారని ఆ మహిళ ఆరోపించింది. తమ ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలు కూడా వారి వద్ద ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

