భారత్‌కు చెందిన ఆ రెండు దగ్గు సిరప్లు వాడొద్దు.. ఉజ్బెకిస్థాన్‌కు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
WHO | భారత్‌లో తయారైన రెండు దగ్గు సిరప్‌లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్‌వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది.
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన రెండు దగ్గు సిరప్‌లను చిన్నారులకు ఇవ్వొద్దని ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వానికి డబ్ల్యూహెచ్‌వో సూచించింది. వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ లేదా ఇథిలీన్ ఉన్నట్లు నిర్ధారించింది. దేశంలోని నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన రెండు దగ్గు మందులు డాక్-1 మ్యాక్స్ సిరప్, అంబ్రోనల్ సిరప్‌లను చిన్నపిల్లలకు వినియోగించకూడదని వెల్లడించింది. ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది పసిపిల్లల మరణాలకు వీటితో సంబంధం ఉన్నదని తెలిపింది.

గతేడాది డిసెంబర్ నెలలో మారియన్ బయోటెక్ తయారుచేసిన ఆ దగ్గు మందు తాగడం వల్ల 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఉజ్బెకిస్థాన్ ఆరోపించింది. 21 మంది చిన్నారులు ఈ సిరప్‌లను తాగగా.. వారిలో 19 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది. ల్యాబుల్లో పరిశీలించగా వాటిలో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు తెలిందని పేర్కొన్నది. దీంతో ఉజ్బెక్ ప్రభుత్వం డబ్ల్యూహెచ్‌వోకి ఫిర్యాదు చేసింది. నాణ్యమైన మందులను అందిచండలో మారియన్ బయోటెక్ విఫమైందని, సిరప్‌ల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించలేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థ తయారుచేసిన రెండు సిరప్లు చిన్నారులకు ప్రాణాంతకమైనవని, వాటిని ఉపయోగించకూడదని డబ్ల్యూహెచ్‌తో సూచించింది.

కాగా, గత అక్టోబర్‌లో భారత్‌కు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లను వాడొద్దంటూ డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. పిల్లల్లో ఈ సిరప్లు మూత్రపిండాలను పాడుచేస్తున్నాయని, ఇతర సమస్యలకు దారితీస్తున్నాయని తెలిపింది. ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 66 మంది పిల్లల మరణాలకు ఈ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌లకు సంబంధం ఉందని పేర్కొంది. మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లలో డైథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నాయని, ఇవి మానవులకు విషపూరితమైనవి అని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

