Operation Iron Swords | హమాస్ గ్రూప్‌పై ఇజ్రాయిల్ యుద్ధం.. ఇంతకీ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అంటే ఏమిటి ?
Operation Iron Swords | ఐరన్ స్వార్డ్స్ పేరుతో ఇజ్రాయిల్ కౌంటర్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్‌లో రిజర్వ్ బలగాలను చేర్చుకుంటోంది. హమాస్ స్థావరాలను టార్గెట్ చేస్తోంది. హమాస్ అటాక్‌లో 22 మంది పౌరులు మృతిచెందినట్లు తెలుస్తోంది.
Operation Iron Swords | టెల్ అవివ్: పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు చేపట్టిన అల్ అక్సా ఆపరేషన్‌కు ప్రతీకరంగా.. ఇజ్రాయిల్ దళాలు కూడా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ఆపరేషన్‌కు ఐరన్ స్వార్డ్స్(Operation Iron Swords) అని పేరు పెట్టారు. హమాస్ గ్రూపుపై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయిల్.. ఐరన్ స్వార్డ్స్ ఆపరేషన్ ద్వారా రిజర్వ్ దళాలను కూడా తమ సైన్యంలోకి తీసుకోనున్నది. హమాస్ ఆక్మసిక దాడికి ప్రతీకారంగా ఐరన్ స్వార్డ్స్ ఆపరేషన్ చేపట్టినట్లు ఇజ్రాయిల్ రక్షణ దశాలు పేర్కొన్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి హమాస్ సుమారు 2200 రాకెట్లను ఫైర్ చేసినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి అడ్మిరల్ డానియల్ హగరి తెలిపారు. భూమి, సముద్రం, వాయు మార్గాల్లో హమాస్ ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడినట్లు ఆయన వెల్లడించారు.
హమాస్ ఉగ్రవాదులు, ఐడీఎఫ్ దళాల మధ్య సుమారు ఏడు ప్రదేశాల్లో ఫైరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐరన్ స్వార్డ్స్ ఆపరేషన్ ద్వారా వేల మంది సైనికుల్ని కదనరంగంలోకి దించాలని మిలిటరీ భావిస్తున్నది. తమ దళాలు కిడ్నాప్ అయినట్లు వస్తున్న వార్తలపై ఐడీఎఫ్ స్పందించలేదు.
హమాస్ అటాక్‌లో 22 మంది పౌరులు, 70 మంది గాయపడినట్లు తెలుస్తోంది. గాజా స్ట్రిప్ వద్ద ఉన్న హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

