న్యూయార్క్, నవంబర్ 19: అమెరికాలోని న్యూయార్క్‌పై మంచుదుప్పటి కప్పుకొన్నది. ‘లేక్ ఎఫెక్ట్’ తుఫాను పశ్చిమ న్యూయార్క్ రాష్ర్టాన్ని వణికిస్తున్నది. మూడురోజులనుంచి నిరంతరాయంగా హిమపాతం కురుస్తున్నది. ఐదు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోయింది. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. బఫెలో నగరంలో గత రెండు రోజుల్లో సుమారు 6 అడుగల మేర మంచు పేరుకుపోయింది. ఇంకా మంచు తుఫాను ప్రభావం కొనసాగుతుండడంతో మరో మూడు అడుగుల మేర మంచు పేరుకుపోనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. మంచు తుఫాను ధాటికి న్యూయార్క్‌లో ఇప్పటివరకూ పది మంది వరకు మృతిచెందారు. ఈ మంచు తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు అమెరికా యోచిస్తున్నది.