Watch: రష్యా సైన్యం దురాగతం… ఉక్రెయిన్‌లో ఒక షాపు లూటీ
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం చెలరేగిపోతున్నది. కొన్ని చోట్ల హద్దులు దాటి ప్రవర్తిస్తున్నది. రష్యా దళాలు దూసుకు వస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని అన్ని నగరాలు నిర్మానుష్యంగా మారాయి. షాపులన్నీ మూసివేసి ఉన్నాయి. అయితే ఒక చోట తెరిచి ఉన్న షాపులోకి రష్యా సైనికులు ప్రవేశించారు. అక్కడున్న ఉన్న వస్తువులలో తమకు కావాల్సిన వాటిని కొందరు రష్యా సైనికులు లూటీ చేశారు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియోను ఉక్రెయిన్ టీవీ ప్రసారం చేసింది. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, మరోచోట రష్యాకు చెందిన ఒక ట్యాంక్ నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న కారుపైకి వేగంగా దూసుకెళ్లింది. వెనక్కి వెళ్లి మరి దానిని బలంగా తొక్కేసింది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తి మరణించి ఉంటాడని భావించి ముందుకు సాగిపోయింది. అనంతరం స్థానికులు వెంటనే ఆ కారు వద్దకు వచ్చారు. రష్యా మిలిటరీ ట్యాంక్ తొక్కేయడంతో నుజ్జైన కారులో చిక్కుకున్న డ్రైవర్‌ను అతి కష్టం మీద బయటకు తీశారు. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడిన ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Za sve one koji ne žele da vide šta Putin radi u Ukrajini.
Ruski narod ne stoji iza ovoga. Ovo je Putinov lični rat.
Na obraz medjunarodnoj zajednici koja ovo nemo posmatra.#Ukraine pic.twitter.com/aqfhpMuX9A
— Balša Božović 🇺🇦🇨🇦🇩🇰 (@Balshone) February 25, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

