బెర్లిన్, జూలై 9 : జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వాగన్ సమూల మార్పులు చేపట్టడానికి సిద్ధమవుతున్నది. అందులో భాగంగా జర్మనీలోని నాలుగు ఫ్యాక్టరీలను మూసివేసేందుకు, లక్ష మందిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ, అమెరికాలో టారిఫ్‌ల పెంపు, యూరోప్‌లో తమ కార్లకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నదని సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులు పేర్కొన్నారు.
హానోవర్, జ్వికావ్, ఎండెన్, ఆడీకి చెందిన నెకార్సుల్మ్లోని ఫ్యాక్టరీలను మూసివేయడం వల్ల 45 వేల మంది ఉపాధి కోల్పోనున్నారని వారు వెల్లడించారు. ఒకేసారి నాలుగు అసెంబ్లింగ్ యూనిట్లను మూసివేయడం, లక్ష మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకడం ఆటోమోటివ్ పరిశ్రమలో అతి పెద్ద పరిణామమని పేర్కొన్నారు. ఇంతకుమునుపు జనరల్ మోటర్స్ సంస్థ 1990, 2009లో దాదాపు 74 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.