Venezuela Earthqauke | వెనెజువెలాను కుదిపేసిన జంట భూకంపాలు.. లక్ష మంది వరకు మరణించొచ్చు.. USGS అంచనా
Venezuela Earthqauke | వెనుజువెలాను వరుస భూకంపాలు కుదిపేశాయి. నిమిషం వ్యవధిలోనే వచ్చిన రెండు భూకంపాల కారణంగా రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయియి.
Venezuela Earthqauke | వెనుజువెలాను వరుస భూకంపాలు కుదిపేశాయి. నిమిషం వ్యవధిలోనే వచ్చిన రెండు భూకంపాల కారణంగా రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయియి. శిథిలాల కింద లక్షలాది మంది చిక్కుకుని ఉండొచ్చని.. దీనివల్ల బారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో వెనెజువెలా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి (state of emergency) ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) తెలిపిన వివరాల ప్రకారం.. తొలి భూకంపం వెనెజువెలాలోని సాన్ ఫెలిపే సమీపంలో సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. దీని భూకంప కేంద్రాన్ని కారకాస్‌కు పశ్చిమంగా సుమారు 284 కి.మీ. దూరంలో గుర్తించారు. ఆ తర్వాత నిమిషం వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. రెండో భూకంపం కారకాస్‌కు పశ్చిమంగా 293 కి.మీ. దూరంలో ఉంది.
ఈ విపత్తులో భారీగా ప్రాణ నష్టం జరిగిందని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే మృతుల సంఖ్యను మాత్రం ఆమె వెల్లడించలేదు. కాగా, ఈ భూకంపాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అమెరికా భూకంప పరిశోధనా సంస్థ హెచ్చరించింది. మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ఇది కేవలం శాస్త్రీయ నమూనాల ఆధారంగా చేసిన అంచనా మాత్రమేనని.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతనే వాస్తవ మృతుల సంఖ్య తెలుస్తుందని స్పష్టం చేసింది.
శిథిలాల కింద బాధితుల కోసం గాలింపు
కారకాస్‌తో పాటు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అనేక భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ యంత్రాలు, ప్రత్యేక రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. దెబ్బతిన్న భవనాల వద్ద పోలీసుల భద్రతా ఏర్పాటు చేశారు. ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు ఇళ్లలోకి వెళ్లవద్దని సూచించారు. ఇక కారకాస్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని తెలిపింది. అధికారిక ప్రకటనలు మాత్రమే విశ్వసించాలని సూచించింది. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Caracas
- death toll
- Earthquake
- USGS
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

