వాషింగ్టన్: వైట్‌హౌజ్ కరస్పాండెంట్స్ డిన్నర్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన జరిగిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరుగుతున్న పార్టీలోకి కోల్ అల్లెన్(Shooter Cole Allen) ఆయుధాలతో దూసుకెళ్లాడు. అయితే అతన్ని సీక్రెట్ ఏజెంట్లు అరెస్టు చేశారు. షూటర్ అల్లెన్ జరిపిన కాల్పుల్లో ఓ ఏజెంట్ గాయపడ్డాడు. ఆ షూటర్‌కు చెందిన కొత్త వీడియోను రిలీజ్ చేశారు. వాషింగ్టన్ అటార్నీ జీనైన్ పిర్రో ఆ వీడియో తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. నిందితుడు అల్లెన్ ఆ హోటల్‌కు ముందు రోజే చేరుకున్నాడు. అతను ఆ హోటల్ రెక్కీ గీశాడు. హోటల్లో అతను ఒంటరిగా తిరుగుతున్న దృశ్యాలను కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 25వ తేదీన జర్నలిస్టుల పార్టీలో కాల్పులకు అతను ప్లాన్ వేశాడు. సుమారు రెండు వేల మంది హాజరై.. ఆ పార్టీ జరుగుతున్న బాల్రూమ్ దిశగా నిందితుడు అల్లెన్ గన్‌తో పరుగెత్తే ప్రయత్నం చేశాడు. సెక్యూర్టీ చెకింగ్ వద్ద గన్‌తో అల్లెన్ పరుగు తీస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. లోపలికి ప్రవేశించే క్రమంలో నిందితుడు అల్లెన్ తన వద్ద ఉన్న గన్‌తో ఓ ఏజెంట్‌ను షూట్ చేశాడు. ఆ ఘటన కూడా వీడియోకి చిక్కింది.
Before the assassination attempt on Trump, Cole Allen took a selfie in his hotel room
The teacher snapped the photo roughly 30 minutes before opening fire near the venue hosting the White House Correspondents’ Association Dinner.
In the image, a bag full of ammunition is… pic.twitter.com/pwgmawufqi
— Visegrád 24 (@visegrad24) April 30, 2026
డిన్నర్ షూటర్ అల్లెన్‌కు చెందిన రూమ్ ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. ఓ ఖాళీ షాట్‌గన్ షెల్‌ను రికవరీ చేశారు. షూటింగ్‌కు ముందు అతను రూమ్‌లో మిర్రర్ సెల్ఫీ దిగినట్లు తెలుస్తున్నది. రూమ్‌లో డియోడరెంట్, సగం వాడిన ప్లాస్టిక్ వాటర్ సీసాను గుర్తించారు. ఓ ఖాళీ గన్కేస్, ఒకటి ఫుల్ అమ్యూనిషన్ కేస్, లగేజీ బ్యాగ్ ఉన్నాయి. 1961లో రాబర్ట్ ఏ హెయిన్‌లిన్ రాసిన స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ లాండ్, 1984లో టామ్ క్లాన్సీ రాసిన టెక్నో థ్రిలర్ ద హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ నవల పుస్తకాలను రూమ్‌లోని కార్పెట్‌పై గుర్తించారు. స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ అనే పుస్తకం అమెరికాను తీర్చదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించిన వాటిల్లో ఒకటని గతంలో లైబ్రరీ కాంగ్రెస్ పేర్కొన్నది. ఓ బ్యాగ్‌లో టేపుతో పాటు సేఫ్టీ గ్లాసులు, గ్యాస్ మాస్క్ ఉన్నట్లు గుర్తించారు.
Today, we are releasing video already provided to U.S. District Court showing Cole Allen shoot a U.S. Secret Service officer during his attempt to assassinate the President at the White House Correspondents’ Dinner.
There is no evidence the shooting was the result of friendly… pic.twitter.com/a8gRXkW6BH
— US Attorney Pirro (@USAttyPirro) April 30, 2026