కారులో బర్గర్ తింటున్న యువకుడు.. సడెన్గా కాల్పులకు తెగబడిన పోలీస్!
US Cop | ప్రముఖ రెస్టారెంట్ చైన్ మెక్డొనాల్డ్స్లో బర్గర్ కొనుక్కున్నాడా యువకుడు. బయట పార్క్ చేసిన తన కారులో కూర్చొని అది తింటున్నాడు. ఇంతలో సడెన్గా అక్కడకు వచ్చిన ఒక పోలీసు అధికారి..
ప్రముఖ రెస్టారెంట్ చైన్ మెక్డొనాల్డ్స్లో బర్గర్ కొనుక్కున్నాడా యువకుడు. బయట పార్క్ చేసిన తన కారులో కూర్చొని అది తింటున్నాడు. ఇంతలో సడెన్గా అక్కడకు వచ్చిన ఒక పోలీసు అధికారి.. టక్కున కారు డోర్ తీశాడు. ఆ యువకుడిని కారు దిగాలని కోరాడు. ఎందుకు? అని అడిగాడా యువకుడు.
అంతే వెంటనే ముందుకు దూకిన పోలీస్.. ఆ కుర్రాడిని బలవంతంగా కారులో నుంచి బయటకు లాగే ప్రయత్నం చేశాడు. అతని పట్టు నుంచి తప్పించుకున్న యువకుడు.. కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో సదరు పోలీస్ అధికారి తుపాకీ తీసి ఆ కారుపై కాల్పులు జరిపాడు. ఈ దారుణమైన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. శాన్ ఆంటోనియోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఆ కారులో ఉన్న ఎరిక్ కాంటూ (17)కు తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడని సమాచారం. అదే కారులో వెనుక సీటులో ఒక యువతి కూడా కూర్చొని ఉందని, అయితే ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన స్థానిక పోలీస్ చీఫ్ విలియం మెక్మానస్.. ఈ ఘటనకు కారణమైన పోలీసు అధికారిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
‘అతని ప్రవర్తనను ఏ రకంగానూ డిఫెండ్ చేయడానికి లేదు. కదిలే కారుపై ప్రాణాంతకం అయితే తప్ప షూట్ చేయకూడదు. కానీ ఆ అధికారి ఆ నిబంధన కూడా పట్టించుకోలేదు’ అని విలియం చెప్పారు. మెక్డొనాల్డ్స్లో ఏదో సమస్య ఉందంటేనే ఆ పోలీసు అధికారి అక్కడకు వెళ్లాడని చెప్పిన విలియం.. కానీ ఎరిక్ కారుకు ఆ సమస్యకు ఎలాంటి సంబంధం లేదని, అయితే ఆ కారు మరో కేసుతో సంబంధం ఉన్న వాహనంలా ఉండటంతోనే దాని దగ్గరకు వెళ్లాడని వివరించారు. అయితే అతను ప్రవర్తన మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని మండిపడ్డారు.
https://twitter.com/i/status/1578397658611388417
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

