అన్ని వేరియంట్లకూ ఒకే టీకా!

- యూనివర్సల్ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
- కరోనా అన్ని రకాల నుంచి సమర్థ రక్షణ
- ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం
- భవిష్యత్ మహమ్మారులను అడ్డుకోవటమే లక్ష్యం
వాషింగ్టన్, జూన్ 23: రానున్న రోజుల్లో కరోనా రకానికి చెందిన మరిన్ని వైరస్లు దాడి చేసే ప్రమాదం ఉన్నదన్న అంచనాల నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ సమగ్ర వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీనిని ‘యూనివర్సల్ కరోనా వ్యాక్సిన్’గా పిలుస్తున్నారు. ముఖ్యంగా జంతువుల నుంచి మనుషులకు సోకే కరోనా రకానికి చెందిన వైరస్‌లను ఎదుర్కొనేలా దీన్ని రూపొందించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో కొవిడ్-19తో పాటు ఇతర కరోనా వైరస్ల ప్రమాదకర వేరియంట్లను తట్టుకొని రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేసేలా ఈ టీకా దోహదపడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
అన్ని వైరస్‌లను ఎలా అడ్డుకోగలదు?
కొవిడ్-19 టీకాలైన ఫైజర్, మోడెర్నాలో వాడిన ఎంఆర్ఎన్ఏ సాంకేతికతను ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి వినియోగించారు. అయితే, కేవలం ఒక వైరస్‌కు చెందిన ఎంఆర్ఎన్ఏ కోడ్‌ను కాకుండా.. పలు కరోనా వైరస్‌లకు సంబంధించిన ఎంఆర్ఎన్ఏ కోడ్లను ఒకే దగ్గర చేర్చి ఈ టీకాను రూపొందించారు. దీంతో కరోనా రకానికి చెందిన అన్ని రకాల వైరస్‌లకు వ్యతిరేకంగా ఈ టీకా ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయగలదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అసలు లక్ష్యం అదేనా?
గడిచిన రెండు దశాబ్దాల్లో కరోనా రకానికి చెందిన రెండు వైరస్లు మహా ఉత్పాతాన్ని సృష్టించాయి. 2003లో సార్స్ విలయం సృష్టించగా.. ప్రస్తుతం సార్స్-కొవ్-2 (కొవిడ్-19) విరుచుకుపడుతున్నది. కాగా.. కరోనా కుటుంబానికి చెందిన సర్బెకోవైరస్ కారణంగా భవిష్యత్తులో మరో ముప్పు పొంచి ఉన్నట్టు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘యూనివర్సల్ వ్యాక్సిన్’ రూపకల్పనకు నడుంకట్టారు.
ఎప్పుడు అందుబాటులోకి?
కొత్త వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యమున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్ తదుపరి ప్రయోగాలు మనుషుల్లో వచ్చే ఏడాదిలో చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతనే టీకా అందుబాటులోకి రానున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

