Zelensky: 31,000 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి : జెలెన్స్కీ
Zelensky: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 31 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. గాయపడ్డ సైనికుల సంఖ్యను చెప్పేందుకు ఆయన నిరాకరించారు. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో వేల సంఖ్యలో సాధారణ ప్రజలు మృతిచెందినట్లు భావిస్తున్నామన్నారు.
కీవ్: రష్యా దాడి వల్ల తమ దేశానికి చెందిన 31 వేల మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Zelensk) తెలిపారు. అయితే రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎంత మంది సైనికులు గాయపడ్డారన్న విషయాన్ని వెల్లడించబోనని జెలెన్స్కీ చెప్పారు. ఎందుకంటే ఆ అంశం రష్యా సైన్యానికి ఊతం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ అధికారికంగా మృతుల సంఖ్యను వెల్లడించిన సందర్భాలు తక్కువే. కానీ కొందరి అంచనాల ప్రకారం ఆ సంఖ్య భారీగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఆదివారం జెలెన్స్కీ మృతుల వివరాలను వెల్లడించారు. మృతుల సంఖ్యపై రష్యా తప్పుడు సమాచారం ఇస్తోందని, అందుకే మృతి చెందిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్యను ప్రకటించినట్లు జెలెన్స్కీ చెప్పారు. తాజా యుద్ధంలో ఇప్పటి వరకు 31000 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని, మూడు లక్షలో లేక లక్షన్నరో కాదు అని ఆయన అన్నారు. పుతిన్ బృందం చెబుతున్నది నిజం కాదు అని, కానీ తమకు జరిగిన నష్టం తీవ్రమైందే అని ఆయన అన్నారు.
యుద్ధంలో సాధారణ పౌరులు చనిపోయిన సంఖ్యను ఆయన వెల్లడించలేదు. కానీ రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో వేల సంఖ్యలో పౌరులు మృతిచెందినట్లు భావిస్తున్నామని అన్నారు. హత్యకు గురైనవారు, వేధింపులకు గురైనవారు, డిపోర్టేషన్‌కు గురైనవారి సంఖ్య తెలియదన్నారు.
రష్యా దాడిలో సుమారు 70 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు గత ఆగస్టులో అమెరికా తెలిపింది. సుమారు లక్షా 20 వేల మంది గాయపడి ఉంటారని పేర్కొన్నది. అయితే ఈ యుద్ధంలో రష్యాకు చెందిన 1,80,000 మంది సైనికులు మృతిచెందారని జెలెన్స్కీ తెలిపారు. వేల సంఖ్యలో రష్యన్లు గాయపడినట్లు ఆయన చెప్పారు.
రష్యా సైన్యంలో ఉన్న 45 వేల మంది మృతిచెంది ఉంటారని, వారికి సంబంధించిన వివరాలను ఓ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఓ మీడియా ద్వారా తెలుస్తోంది. రష్యా సైనికుల మృతిపై బ్రిటన్ రక్షణశాఖ కూడా ఓ ప్రకటన చేసింది. సుమారు మూడున్నర లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని బ్రిటన్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

