Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
Starlink Network: స్టార్‌లింక్ పనితీరుపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆ శాటిలైట్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పింది. దీని వల్ల డ్రోన్లలో వేగం తగ్గినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ ఆరోపిస్తున్నది. ఆంక్షలు ఎత్తివేసినట్లు ట్రంప్ చెప్పినా.. మస్క్ కంపెనీ మాత్రం అప్‌లింక్ స్పీడ్‌ను పెంచలేదు.
కీవ్: స్టార్‌లింక్ నెట్వర్క్(Starlink Network)తో ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయని ఉక్రెయిన్ చెబుతోంది. ఆ దేశ రక్షణ శాఖ కూడా ఈ విషయాన్ని ద్రువీకరిస్తున్నది. ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ అప్‌లింక్ ఆంక్షలు ఎత్తివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినా.. ఉక్రెయిన్‌లో మాత్రం స్టార్‌లింక్ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే డ్రోన్లకు కనెక్షన్ లాస్ ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో మిలిటరీ ఆపరేషన్స్ అవరోధాలకు గురవుతున్నాయి.
రష్యాతో యుద్ధం వేళ స్టార్‌లింక్ శాటిలైట్ సంబంధాలు కీలకంగా మారాయి. స్టార్‌లింక్‌కు చెందిన మిలిటరీ గ్రేడ్ శాటిలైట్ స్టార్‌షీల్డ్ .. ఉక్రెయిన్‌కు సేవలు అందించరాదు అని టెక్ బిలియనీర్‌కు ఆదేశాలు ఇవ్వలేదని ఇటీవల ట్రంప్ చెప్పారు. స్టార్‌షీల్డ్ మళ్లీ సేవల్ని అందిస్తున్నట్లు మస్క్ కూడా వెల్లడించారు. స్టార్‌లింక్ కానీ స్టార్‌షీల్డ్ పనితీరు నెమ్మదించడానికి తనకు ఎటువంటి సంబంధం లేదని మస్క్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. స్టార్‌లింక్ లేదా స్టార్‌షీల్డ్ సేవల్లో అంతరాయం వల్ల ఉక్రెయిన్ తన డ్రోన్ సామర్థ్యాన్ని సరిగా వినియోగించుకోలేకపోయింది.
శాటిలైట్ కనెక్షన్ స్పీడ్ తగ్గడం వల్ల.. అటాక్ డ్రోన్లను వాడడం లేదా డిఫెన్సివ్ ఆపరేషన్స్‌ను సరైన రీతిలో కోఆర్డినేట్ చేయలేకపోతున్నది. స్టార్‌లింక్‌తో పాటు స్టార్‌షీల్డ్ నెట్‌వర్క్‌లను అనునిత్యం మానిటర్ చేస్తున్నామని ఉక్రెయిన్ రక్షణశాఖ వర్గాలు చెబుతున్నాయి. శాటిలైట్లపై ఉన్న ఆంక్షలను అమెరికా ఎత్తివేసినట్లు తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని ఉక్రెయిన్ రక్షణశాఖ పేర్కొన్నది.
లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లకు అప్‌లింక్ స్పీడ్‌ను తగ్గించినట్లు కీవ్ ఇటీవల ఆరోపించింది. దీంతో డ్రోన్లు ప్రయాణించే వేగం తగ్గింది. 100 కిలోమీటర్ల కన్నా వేగంగా ప్రయాణించే డ్రోన్లకు సంబంధాలు తెగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. ఉక్రెయిన్ రక్షణ శాఖ తమ ఆపరేషన్స్ కోసం స్టార్షీల్డ్ను వాడుతోంది. అయితే ఆ శాటిలైట్‌ను అమెరికా మిలిటరీ కంట్రోల్ చేస్తోంది, ప్రస్తుతం వస్తున్న సమస్య వెనుక పెంటగాన్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్ శాటిలైట్ నెట్‌వర్క్‌లపై ఆంక్షలు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలను శ్వేతసౌధం ఖండించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

