Turkey Earthquake | టర్కీలో మళ్లీ భూకంపం.. కుప్పకూలిన డ్యామేజ్డ్ బిల్డింగ్స్
Turkey Earthquake | మూడు వారాల క్రితం భారీ భూకంపాలతో వణికిపోయిన టర్కీని తాజాగా మరో భూకంపం కలవరపెట్టింది. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 69 మందికి గాయాలయ్యాయి.
Turkey Earthquake: మూడు వారాల క్రితం భారీ భూకంపాలతో వణికిపోయిన టర్కీని తాజాగా మరో భూకంపం కలవరపెట్టింది. సోమవారం 5.6 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. మలత్యా రాష్ట్రంలోని యెసిల్యూర్ట్ పట్టణంలో భూమి కంపించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 69 మందికి గాయాలయ్యాయి. టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టాయి. క్షతగాత్రులను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల వచ్చిన భూకంపాల ధాటికి అనేక ఇళ్లు కుప్పకూలగా తాజాగా మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. సోమవారం సంభవించిన భూకంపంతో ఇప్పటికే దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా కుప్పకూలాయి. సుమారు 25 భవనాలు కూలినట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం శిథిలాల కింద తండ్రీకుమార్తెలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
కాగా, ఫిబ్రవరి 6న దక్షిణ తుర్కియే, ఉత్తర సిరియాలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ విపత్తు కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 11 రాష్ట్రాలలో మాలత్యా కూడా ఒకటి. ఈ ప్రకృతి విలయ తాండవం కారణంగా తుర్కియే, సిరియా దేశాలలో 48 వేల మందికి పైగా మృతి చెందారు. దీంతోపాటు ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 1,73,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు భూకంప ప్రభావిత ప్రాంతాలలో దాదాపు 10,000 ప్రకంపనలు సంభవించాయి. దీంతో దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లొద్దని అధికారులు కోరుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

