న్యూయార్క్, జూన్ 3: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని కలువాలనుందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైనప్పుడే ఖమేనీ గాయపడి మంచాన పడ్డారని.. కానీ అతను ఇరాన్ను ప్రభావితం చేస్తున్నారన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటాన్ని అంగీకరించబోమని ట్రంప్ తేల్చి చెప్పారు.
ఇరాన్ కూడా అణ్వాయుధాలు వదిలేయడానికి అంగీకరించిందని.. వాళ్లు తమ మైండ్ సెట్ మార్చుకుంటున్నారని తెలిపారు. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు ఆగిపోయాయంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఐడీలో పోస్టు చేశారు.