వాషింగ్టన్, మే 2: భూమ్మీద సరస్సులు, నదులు, సముద్రాలు, మైదానాలు, ఇసుక దిబ్బలు, కొండలు ఉన్నట్టే శని ఉపగ్రహమైన టైటాన్ మీద కూడా ఇవన్నీ ఉన్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది.
భూమ్మీద ఉన్న సరస్సుల్లో నీళ్లుంటే అక్కడ ద్రవ మీథేన్ ఉంటుందని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ జియాలజిస్టు మాథ్యూ లాపోట్రే తెలిపారు. టైటాన్‌పై నైట్రోజన్ గాలులు వీస్తాయని, ఈ గాలుల కారణంగా హైడ్రోకార్బన్ దిబ్బలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. శని గ్రహానికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో టైటాన్ అతిపెద్దది.