Paetongtarn Shinawatra | థాయ్‌లాండ్ ప్రధానిగా పెటోంగ్టార్న్ షినవత్ర.. ఆ కుటుంబంలో పీఎంగా మూడో వ్యక్తి
థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా పెటోంగ్టార్న్ షినవత్ర (37)ను పార్లమెంటు శుక్రవారం ఎన్నుకుంది. ఆమె మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర కుమార్తె.
బ్యాంకాక్: థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా పెటోంగ్టార్న్ షినవత్ర (37)ను పార్లమెంటు శుక్రవారం ఎన్నుకుంది. ఆమె మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర కుమార్తె. షినవత్ర కుటుంబంలో ఈ పదవిని చేపట్టినవారిలో పెటోంగ్టార్న్ మూడో వ్యక్తి. ప్రధాని పదవిని చేపట్టడానికి దిగువ సభలో కనీసం 247 మంది సభ్యుల మద్దతు అవసరం.
ఫ్యూ థాయ్ పార్టీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమికి 314 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరు పెటోంగ్టార్న్కు మద్దతు తెలిపారు. ఆమె నేతృత్వంలో ఈ కూటమి మరింత బలపడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధాని పదవి నుంచి స్రేట్ట తవిసిన్‌ను బుధవారం కోర్టు తొలగించడంతో ఈ ఎన్నిక అవసరమైంది. ఆయన నైతిక నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లు కోర్టు తీర్పు చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

