Sri Lanka | శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. భారీ విజయం దిశగా వామపక్ష నేత దిసనాయకే
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (JVP) చీఫ్ అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayak) భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన 10 లక్షల ఓట్లలో 53 శాతంతో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు.
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున (JVP) చీఫ్ అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayak) భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన 10 లక్షల ఓట్లలో 53 శాతంతో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రమేదాస 22 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే 16 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మేరకు లంక ఎన్నికల కమిషన్ డేటాలో ఉన్నది.
దిసనాయకే ముందున్నట్లు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. సర్వే ఫలితాలను నిజంచేస్తూ ఆయన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. మొత్తం అర్హులైన 17 మిలియన్ల మంది ఓటర్లలో 75 శాతం మంది శనివారం జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తికాగానే పోస్టల్ ఓట్లను లెక్కించడం ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కవ ఓట్లు వస్తాయో వారే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే.. రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటివరకు మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతోనే ఫలితాలు వెలువడ్డాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

