ఇండియాలో రాబోయే తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే!

న్యూఢిల్లీ: ఇప్పుడు ఇండియా ఉన్న పరిస్థితుల్లో కరోనా నుంచి గట్టెక్కాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషనే. అందులో భాగంగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. తాజాగా డీసీజీఐ కూడా వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్‌వో అనుమతి పొందిన వ్యాక్సిన్లకు దేశంలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌పై దేశం దృష్టి సారిస్తోంది. దీనికోసం రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే భారత ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే ఇండియాలో లాంచ్ కాబోయే తొలి సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ లైట్ నిలవనుంది.
ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి పలు దేశాల్లో ట్రయల్స్ జరగడంతోపాటు అనుమతులు కూడా వచ్చేశాయి. వ్యాక్సిన్ వేసిన 28 రోజుల తర్వాత కరోనా వైరస్‌పై 79.4 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ ట్రయల్స్ ప్రధానంగా రష్యన్లపైనే జరిగాయి. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా రష్యా, యూఏఈ, ఘనాలాంటి దేశాల్లో 7 వేల మందికి ఈ వ్యాక్సిన్ వేశారు. స్పుత్నిక్ లైట్‌లాంటి సింగిల్ డోస్ వ్యాక్సిన్ వల్ల దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరుగుతుంది. ఇప్పటికే ఈ స్పుత్నిక్ వి రెండు డోసుల వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడు కన్సైన్మెంట్లు హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం అత్యధికంగా 30 లక్షల డోసులు ల్యాండయ్యాయి. ఈ టీకాలను ఇండియాలో అపోలో హాస్పిటల్స్ వేస్తున్నాయి. ఒక్కో డోసు ధరను రూ.1195గా నిర్ణయించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

